అక్షరటుడే, వెబ్‌డెస్క్: Dense Fog | రాష్ట్రవ్యాప్తంగా రెండు రోజులుగా చలితీవ్రత తగ్గింది. అయితే పొగమంచు కమ్మేసింది. ఆకాశం మేఘావృతమై ఉండటంతో పాటు మంచు కురుస్తుండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
హైదరాబాద్ (Hyderabad) నగరంతో పాటు మిగతా ప్రాంతాల్లో సైతం పొగమంచు కమ్మేసింది. శుక్రవారం తెల్లవారుజామున భారీగా మంచు దుప్పటి కప్పేయడంతో ప్రజలుత తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం 9 గంటల వరకు మంచు వీడలేదు. నాలుగు మీటర్ల దూరంలో ఉన్నవి కూడా కనిపించలేనంతంగా మంచు కమ్మేసింది. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. విజిబిలిటీ తక్కువగా ఉండటంతో వాహనాలు నెమ్మదిగా వెళ్తున్నాయి.
Dense Fog | ప్రయాణికుల అవస్థలు
శంషాబాద్ ఎయిర్పోర్ట్ (Shamshabad Airport), ఓఆర్ఆర్లో పొగమంచు కారణంగా విమాన సర్వీసులకు అంతరాయం కలిగింది. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎయిర్ ఇండియా (Air India)కు చెందిన ఢిల్లీ–హైదరాబాద్ విమానం రద్దయింది. ఇండిగోకు చెందిన హైదరాబాద్–తిరుపతి విమానం ఆలస్యమైంది. విమానాల రద్దు, ఆలస్యంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. నగర శివారులోని కిస్మత్పూర్, శంషాబాద్, రాజేంద్రనగర్, ఔటర్ రింగ్ రోడ్డులోని కొన్ని ప్రాంతాల్లో భారీగా పొగమంచు కమ్మేసింది. ఢిల్లీలో సైతం పొగమంచు ప్రభావంతో ఢిల్లీ నుంచి శంషాబాద్‌కు రావాల్సిన, ఇక్కడి నుంచి ఢిల్లీకి వెళ్లాల్సిన ఎయిరిండియా విమానాలు రద్దు అయ్యాయి. ఢిల్లీ ఎయిర్పోర్ట్ (Delhi Airport)లో 140కి పైగా ఫ్లైట్లు రద్దు చేశారు.
రాష్ట్రంలో మరో ఐదు రోజులు చలితీవ్రత తక్కువగా ఉంటుంది. ఈ నెల 7 వరకు సాధారణ ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయి. అయితే పొగమంచు మాత్రం కురుస్తోంది. దీంతో ప్రజలు జాగ్రత్తలు పాటించాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. ముఖ్యంగా హైవేలపై తెల్లవారు జామున ప్రయాణాలు చేసే వారు అప్రమత్తంగా ఉండాలి.