అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Dundigal Police | హైదరాబాద్ (Hyderabad) నగరంలోని దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. ఓ మహిళ తన రెండు నెలల కుమారుడిని కట్టెలో పొయ్యిలో వేసి చంపేసింది.
మధ్యప్రదేశ్ (Madhya Pradesh)కు చెందిన రాజేంద్ర ఆదివాసీ (21), తన భార్య మమత అహిర్వార్ (20)తో కలిసి బౌరంపేట్‌లో ఉంటున్నాడు. ఓ అపార్ట్మెంట్లో నిర్మాణ కార్మికులుగా పని చేస్తున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన క్యాంప్ గదిలో నివాసం ఉంటున్నారు. అయితే ఈ దంపతులకు ఒక బాబు ఉన్నాడు. మంగళవారం ఉదయం రాజేంద్ర పని నిమిత్తం బయటకు వెళ్లాడు. తిరిగి వచ్చే సరికి మమత తన కుమారుడిని కట్టెలో పొయ్యిలో కాలుస్తున్నట్లు గుర్తించాడు. వెంటనే వెళ్లి అడ్డుకోవడానికి యత్నించాడు. అయితే అప్పటికే చిన్నారి మృతి చెందాడు.
Dundigal Police | కాళ్లు కట్టేసి..
చిన్నారికి రక్షణగా ఉండాల్సిన తల్లే కర్కశంగా ప్రవర్తించిన ఘటన తీవ్ర చర్చనీయాంశం అయింది. రెండు నెలల పసికందును కనికరం లేకుండా చంపేయడం గమనార్హం. బాబు ఏడవకుండా నొట్లో గుడ్డలు పెట్టి, కాళ్లు కట్టేసి కట్టెల పొయ్యిలో వేసింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు. బాలుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. నిత్యం బాబు ఏడవడంతో ఇబ్బంది పడుతున్న మమత ఎలాగైన చంపాలని నిర్ణయించుకున్నట్లు పోలీసులు ప్రాథమిక విచారణలో వెల్లడైంది.
