అక్షరటుడే, వెబ్‌డెస్క్ : HYDRAA land protection | హైదరాబాద్ (Hyderabad) నగరంలో ఆక్రమణలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతంది. వందల కోట్ల విలువైన ప్రభుత్వ, ప్రజావసరాలకు చెందిన భూములను కబ్జా చెరల నుంచి విడిపిస్తోంది.
నగరంలోని మాదాపూర్ (Madhapur) కాకతీయ హిల్స్‌లో రూ.100 కోట్ల స్థలాన్ని కాపాడిన మంగళవారం హైడ్రా కాపాడింది. ఇక్కడ 1979లో రవీంద్ర కోఆపరేటివ్ సొసైటీ పేరుతో లే అవుట్ వేశారు. ఇందులో 558 ప్లాట్లు విక్రయించగా.. 6 ఎకరాలు ఓపెన్ స్పేస్‌గా నిర్వాహకులు వదిలేశారు. అయితే ఆ ఖాళీ స్థలాన్ని 1974లో క్రయ, విక్రయలు జరిగినట్లు నకిలీ డాక్యుమెంట్స్ సృష్టించి, జిల్లా, హై కోర్టులలో కబ్జాదారులు కేసులు వేశారు.
HYDRAA land protection | అసోసియేషన్ ఫిర్యాదుతో..
పార్కు స్థలం కబ్జాకు యత్నిస్తున్నారని కాకతీయ హిల్స్ అసోసియేషన్ సభ్యులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. దీంతో అధికారులు క్షేత్ర స్థాయిలో పరిశీలన చేపట్టారు. ఆక్రమణలు నిజమేనని నిర్ధారించుకొని.. మంగళవారం ఆ భూమిని స్వాధీనం చేసుకున్నారు. రోడ్డు నంబర్ 3లో మొత్తం 4,090 గజాల పార్క్ స్థలాన్ని హైడ్రా కాపాడింది. చుట్టు ఫెన్సింగ్ వేసింది. రోడ్ నెంబర్ 2లోని 5700 గజాల సొసైటీ కామన్ ల్యాండ్ కు కంచె ఏర్పాటు చేసింది. ఈ భూమి విలువ రూ.100 కోట్ల వరకు ఉంటుందని అధికారులు తెలిపారు. స్థలాన్ని కబ్జా చెరల నుంచి కాపాడటంతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. హైడ్రాకు ధన్యవాదాలు తెలిపారు.
