HomeతెలంగాణHyderabad Rains | హైదరాబాద్​లో రికార్డు స్థాయిలో వర్షపాతం

Hyderabad Rains | హైదరాబాద్​లో రికార్డు స్థాయిలో వర్షపాతం

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hyderabad Rains | హైదరాబాద్​లో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. గురువారం తెల్లవారుజామున నుంచే నగరంలోని పలు ప్రాంతాల్లో వాన దంచికొట్టింది. గత వారం రోజులుగా నగరంలోని పలు ప్రాంతాల్లో నిత్యం వర్షం (rain) పడుతుంది. గురువారం కురిసిన వర్షంతో హైదరాబాద్​లో (hyderabad) 2024–25లో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది.

Hyderabad Rains | వెయ్యి మి.మీ. దాటిన వర్షపాతం

హైదరాబాద్​లో (hyderabad) గురువారం కురిసిన వర్షంతో ఏడాది కాలంలో వెయ్యి మి.మీ. దాటి వర్షపాతం నమోదు కావడం గమనార్హం. 2024 జూన్​ 1 నుంచి ఈ రోజు వరకు హైదరాబాద్​ మహా నగరంలో (hyderabad city) 1010.9 మిల్లిమీటర్ల వర్షం కురిసింది. సాధారణ వర్షపాతం 812.2 మి.మీ. కాగా 24.5 శాతం అధిక వర్షపాతం (rainfall) నమోదు కావడం గమనార్హం.

Hyderabad Rains | పలు ప్రాంతాల్లో కురిసిన వర్షం..

హైదరాబాద్​లోని పలు ప్రాంతాల్లో గురువారం భారీ వర్షం (heavy rain) కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయ. రోడ్లపై నీరు నిలిచింది. దీంతో వాహనదారులు, ప్రజలు ఇబ్బందులు పడ్డారు. జీహెచ్​ఎంసీ (GHMC) పరిధిలోని గోల్కొండలో (golconda) గురువారం 37.6 మి.మీ. వర్షం కురిసింది. బహదూర్​పూరాలో 25.8, హయత్​నగర్​లో (hayathnagar) 22.5, ఆసిఫ్​నగర్​లో 20.4, మారేడ్​పల్లి 20.1, సికింద్రాబాద్ (secunderabad)​ 15.7, షేక్​పేట 15.5, కుత్బుల్లాపూర్​ 18.9, కాప్రా 18.6, రాజేంద్రనగర్​లో 16.2 మి.మీ. వర్షపాతం నమోదు అయింది.