అక్షరటుడే, వెబ్డెస్క్ : Hyderabad Ganja Seizure | హైదరాబాద్ నగరంలో పోలీసులు భారీగా గంజాయి పట్టుకున్నారు. ఒడిశా (Odisha) నుంచి తీసుకువచ్చి నగరంలో విక్రయిస్తున్న ఇద్దరిని అరెస్ట్ చేశారు.
నగర పోలీసులు ఆదివారం అఫ్జల్ గంజ్ (Afzal Ganj) పరిధిలో గంజాయి పట్టుకున్నారు. ఒడిశా నుంచి హైదరాబాద్కు బస్సులో ముఠా సభ్యులు గంజాయి తీసుకొస్తున్నారు. ఎంజీబీఎస్ (MGBS) దగ్గర గంజాయి అమ్మేందుకు ఇద్దరు యత్నించగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి పది కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. నిందితులను ఒడిశాకు చెందిన ఆశిష్ శిఖ్దార్, భీమా జాలిగా గుర్తించారు. ఈ మేరకు వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
హైదరాబాద్లో ఇటీవల గంజాయి, డ్రగ్స్ దందా భారీగా పెరిగింది. ఈగల్ టీమ్ (Eagle Team), ఎస్వోటీ పోలీసులు, హెచ్ న్యూ విభాగం అధికారులు నిత్యం తనిఖీలు చేపడుతున్నారు. భారీగా గంజాయి స్వాధీనం చేసుకుంటున్నారు. అయినా కూడా నగరంలో గంజాయి విక్రయాలు మాత్రం ఆగడం లేదు. ఎంతో మంది విద్యార్థులు, యువత వీటికి బానిసలుగా మారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. సరదాగా గంజాయి మొదలు పెట్టి కొందరు బానిసలుగా మారుతున్నారు. నగరంలో పలు గంజాయి ముఠాలు సైతం ఉన్నాయి. గంజాయి మత్తులో వీరు ప్రజలపై దాడులకు పాల్పడుతున్నారు. గంజాయి విక్రయాలపై కఠిన చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.