అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Hyderabad Formula E Case | ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ (IAS Arvind Kumar) ప్రాసిక్యూషన్‌కు అనుమతి లభించింది.
బీఆర్ఎస్ హయాంలో హైదరాబాద్ (Hyderabad) నగరంలో ఫార్మూలా ఈ కారు రేసు కేసు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో అక్రమాలు జరిగాయని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఏసీబీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ కీలకంగా వ్యవహరించినట్లు ఏసీబీ పేర్కొంటుంది. ఈ మేరకు ఆయనను గతంలో పలుమార్లు ఏసీబీ అధికారులు విచారించారు. ఈ కేసులో ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్‌ను సైతం ఏసీబీ విచారించింది. తాజాగా ఆయన ప్రాసిక్యూషన్‌కు కేంద్రం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు రాష్ట్రానికి సమాచారం అందించింది. ఇప్పటికే కేటీఆర్ (KTR) ప్రాసిక్యూషన్‌కు గవర్నర్ అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఛార్జ్‌షీట్ దాఖలు చేసేందుకు ఏసీబీ సిద్ధం అవుతోంది.
Hyderabad Formula E Case | అనుమతులు లేకుండా..
ఫార్ములా ఈ కార్ రేసులో హెచ్ఎమ్డీఏ (HMDA) భాగస్వామి కాదు. అయినప్పటికీ దాని ఖాతా నుంచి రూ.54.88 కోట్లు చెల్లించారని ఏసీబీ అధికారులు తెలిపారు. ఆర్థికపరమైన అనుమతులు లేకుండానే అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు వీటిని చెల్లించినట్లు ఏసీబీ నివేదికలో వెల్లడించింది. ఎన్నికల కోడ్ అమలులో ఉండగా నిబంధనలు పాటించకుండా విదేశీ కంపెనీలకు నిధులు మంజూరు చేశారని మరో అభియోగం ఉంది. దీంతో హెచ్ఎండీఏ ఆదాయ పన్ను శాఖకు రూ.8 కోట్లకు పైగా జరిమానా చెల్లించాల్సి వచ్చింది. ఈ రేసు వ్యవహారంలో క్విడ్ ప్రోకో జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. సదరు కంపెనీ బీఆర్ఎస్ ఎలక్ట్రోల్ బాండ్లు కొనుగోలు చేసినట్లు సమాచారం.