అక్షరటుడే, వెబ్డెస్క్ : ABSLI | భాగ్యనగర వాసులు దేశ సగటు కన్నా మెరుగైన ఆర్థిక ప్రణాళికతో ఉన్నారని ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఇన్సూరెన్స్ (Aditya Birla Sun Life Insurance) నిర్వహించిన సర్వే వెల్లడించింది. జాతీయ అనిశ్చితి సూచీ 79 కాగా, హైదరాబాద్ లో ఇది 76 గా ఉంది. అంటే నగర ప్రజలు తమ భవిష్యత్తు మీద దేశంలోని మిగిలిన వారి కన్నా ఎక్కువ ధీమాగా ఉన్నారు. కాకపోతే దక్షిణ భారత్ లోని ఇతర ప్రాంతాల సగటు 71 తో పోలిస్తే నగరంలో ఆందోళనలు కొంచెం అధికంగా ఉన్నాయి.
ABSLI | ముఖ్యమైన సమస్యలు
నగర ప్రజలను డిజిటల్ భద్రత (Digital security) ఎక్కువగా వేధిస్తోంది. వ్యక్తిగత సమాచారం దొంగతనం, ఆన్లైన్ లావాదేవీల భద్రత, ఆర్థిక స్కామ్ ల పట్ల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. నగరంలో పెరుగుతున్న నేరాలు, కాలుష్యం, జీవన వ్యయం, మౌలిక వసతుల విస్తరణ కూడా వారిని ఒత్తిడికి గురి చేస్తున్నాయి.
ABSLI | బీమా ఉంటే ధీమా
సరైన ఆర్థిక రక్షణ ఉన్నవారిలో భయం తక్కువగా ఉందని నివేదిక తేల్చింది. ఒకటి లేదా రెండు బీమా పాలసీలు ఉన్నవారిలో అనిశ్చితి 77 ఉంటే, నాలుగు అంతకంటే ఎక్కువ పాలసీలు ఉన్నవారిలో ఇది 64 కు తగ్గింది. తగినంత బీమా పాలసీలు ఉండటం వల్ల భవిష్యత్తు పట్ల ధైర్యం పెరుగుతోంది.
ABSLI | ఆదాయం ఇతర వ్యత్యాసాలు
ఆదాయ వర్గాల మధ్య భవిష్యత్తుపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఎక్కువ ఆదాయం ఉన్న వారిలో ఆందోళన తక్కువ. మధ్య, దిగువ ఆదాయ వర్గాల్లో అనిశ్చితి స్థాయి 82 నుండి 83 వరకు ఉంది. పురుషుల కన్నా మహిళలు, యువత కన్నా వయసులో పెద్దవారు, పిల్లలు ఉన్న తల్లిదండ్రులు ఆర్థిక బాధ్యతల పట్ల కొంత ఆందోళనతో ఉన్నారు. ముందస్తు ప్రణాళిక, సరైన బీమా రక్షణ ద్వారా ఈ సమస్యను అధిగమించవచ్చు అని నివేదిక సూచిస్తోంది.