అక్షరటుడే, వెబ్డెస్క్ : Hyderabad Cyber Crime Arrests | హైదరాబాద్ పోలీసులు (Hyderabad Police) భారీ ఆపరేషన్ చేపట్టారు. సైబర్ నేరాలకు పాల్పడుతున్న 104 మంది నిందితులను అరెస్ట్ చేశారు.
దేశంలో రోజురోజుకు సైబర్ నేరాలు (Cyber Crimes) పెరుగుతున్నాయి. కొత్త కొత్త మార్గాల్లో కేటుగాళ్లు ప్రజలను మోసం చేస్తున్నారు. హైదరాబాద్ నగరంలో నిత్యం ఎంతో మంది మోసపోతున్నారు. ఈ క్రమంలో సైబర్ క్రైమ్ పోలీసు (Cyber Crime Police)లకు అనేక ఫిర్యాదులు వస్తున్నాయి. దీంతో పోలీసులు ఆక్టోపస్ పేరుతో స్పెషల్ ఆపరేషన్ చేపట్టారు. 16 రాష్ట్రాల్లో 104 మంది సైబర్ నేరగాళ్లని అరెస్ట్ చేశారు. నిందితుల్లో బ్యాంకు ఉద్యోగులు సైతం ఉండటం గమనార్హం.
Hyderabad Cyber Crime Arrests | రూ.127 కోట్ల సైబర్ మోసాలు
నిందితుల నుంచి పోలీసులు రూ.36 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. రెండు వందలకు పైగా ఫోన్లు సీజ్ చేశారు. వీరిపై దేశవ్యాప్తంగా 1,055 కేసులు ఉండగా.. ఇప్పటివరకు వీరు రూ.127 కోట్లకు పైగా కాజేసినట్లు గుర్తించారు. సైబర్ నేరాలపై తెలంగాణ పోలీసులు (Telangana Police) కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఓ వైపు ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు కల్పిస్తున్నారు. మరోవైపు నిందితులను సైతం అదుపులోకి తీసుకుంటున్నారు. గతంలో కూడా పలు రాష్ట్రాల్లో ప్రత్యేక ఆపరేషన్ చేపట్టి సైబర్ నేరస్తులను తెలంగాణ పోలీసులు పట్టుకున్నారు. అయితే తాజాగా అరెస్ట్ అయిన వారిలో బ్యాంకు ఉద్యోగులు ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ప్రజల డబ్బును కాపాడాల్సిన వారు.. సైబర్ నేరస్తులతో కలిసి మోసాలకు పాల్పడుతుండటం గమనార్హం. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
