ePaper
More
    HomeతెలంగాణHyderabad CP Anand | ప్రైవేట్​ పాఠశాలలకు హైదరాబాద్​ సీపీ వార్నింగ్

    Hyderabad CP Anand | ప్రైవేట్​ పాఠశాలలకు హైదరాబాద్​ సీపీ వార్నింగ్

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Hyderabad CP Anand | ప్రైవేట్​ పాఠశాలలు విద్యార్థులను తీసుకువెళ్లడానికి సురక్షితమైన మార్గాలను వినియోగించాలని హైదరాబాద్​ సీపీ ఆనంద్(Hyderabad CP Anand)​ సూచించారు. పాఠశాలల యాజమాన్యాలు రోడ్డు భద్రత ప్రమాణాలు పాటించకపోతే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. విద్యా సంవత్సరం ప్రారంభమైన సందర్భంగా శుక్రవారం హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు రవీంద్ర భారతి(Ravindra Bharati)లో ప్రైవేట్​ పాఠశాలల యాజమాన్యాలతో సమావేశం నిర్వహించారు.

    Hyderabad CP Anand | ట్రాఫిక్​ మార్షల్స్​ నియమించుకోవాలి

    ప్రైవేట్​ పాఠశాలలు(Private schools) ఫిట్​నెస్​ ఉన్న బస్సులనే వినియోగించాలని సీపీ సూచించారు. కార్యక్రమానికి కలెక్టర్, RTA, RTC అధికారులు, 750 మంది పాఠశాల ప్రతినిధులు హాజరయ్యారు. సీపీ మాట్లాడుతూ.. పాఠశాలలు ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులను ట్రాఫిక్ మార్షల్స్‌(Traffic marshals)గా నియమించుకోవాలని ఆయన సూచించారు. పాఠశాల వెలుపల, లోపల 200 మీటర్ల పొడవునా ట్రాఫిక్‌ను నియంత్రించాలన్నారు. వారికి ట్రాఫిక్ పోలీసులు(Traffic police) శిక్షణ ఇస్తారని చెప్పారు. మైనర్ డ్రైవింగ్, ఓవర్‌లోడింగ్, ప్రమాదకర రవాణాను సహించబోమని కమిషనర్ స్పష్టం చేశారు.

    Hyderabad CP Anand | సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి

    పాఠశాలలో, బయట కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సీపీ ఆనంద్​ సూచించారు. కొన్ని చోట్ల మాదకద్రవ్యాలను విక్రయిస్తున్నందున పాన్ షాపులు(Pawn shops) మరియు పాఠశాలల సమీపంలోని ఇతర చిన్న దుకాణాలను తొలగించాలని ఆదేశించారు. విద్యార్థులకు ఏదైనా జరిగితే పాఠశాల యాజమాన్యం బాధ్యత వహించాలని స్పష్టం చేశారు.

    More like this

    CP Sai Chaitanya | పోలీస్​ ఇమేజ్​ పెంచేవిధంగా విధులు నిర్వర్తించాలి: సీపీ సాయిచైతన్య

    అక్షరటుడే, బోధన్​: CP Sai Chaitanya | నిజామాబాద్​ కమిషనరేట్​ పరిధిలో పోలీస్​ ఇమేజ్​ను పెంచేవిధంగా సిబ్బంది విధులు...

    Alumni reunion | 14న పూర్వ విద్యార్థుల సమ్మేళనం

    అక్షరటుడే, భిక్కనూరు: Alumni reunion | మండలంలో జిల్లా పరిషత్​ బాలుర ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనం...

    Yellareddy | అటవీ భూముల పరిశీలన

    అక్షర టుడే, ఎల్లారెడ్డి : Yellareddy | మండలంలోని వెల్లుట్ల (Vellutla) శివారులోని హేమగిరి ప్రాంతంలో గల అటవీ...