Hyderabad CP Marriage Warning | పెళ్లికి ముందు దగ్గరవ్వొద్దు.. అమ్మాయిలకు సీపీ హెచ్చరిక

పెళ్లి పేరుతో జరిగే మోసాలపై యువతులు అప్రమత్తంగా ఉండాలని సీపీ సజ్జనార్​ సూచించారు. డబ్బులు డిమాండ్​ చేస్తే ఫిర్యాదు చేయాలన్నారు.

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hyderabad CP Marriage Warning | హైదరాబాద్​ సీపీ సజ్జనార్​ (CP Sajjanar) యువతులకు జాగ్రత్తలు చెప్పారు. పెళ్లి పేరుతో జరుగుతున్న మోసాలపై అప్రమత్తంగా ఉండాలని ఆయన హెచ్చరించారు.

హైదరాబాద్ (Hyderabad) నగరంలో పెళ్లి పేరుతో జరుగుతున్న మోసాలు ఆందోళన కలిగిస్తున్నాయని సజ్జనార్​ అన్నారు. ప్రేమ పేరుతో, పెద్దలు కుదిర్చిన సంబంధాల మాటున కూడా కొందరు యువతులను మోసం చేస్తున్నారని పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలపై ఇటీవల హైదరాబాద్ షీ టీమ్స్‌ (Hyderabad She Teams)కు ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయని చెప్పారు.

Hyderabad CP Marriage Warning | బ్లాక్ మెయిల్ చేసి..

కొందరు సంప్రదాయబద్ధంగా పెళ్లి చూపులు, ఆపై ఎంగేజ్‌మెంట్ జరిపించుకుంటున్నారు. పెళ్లి ఖాయమైంది కదా అనే చనువుతో యువతులకు వారు దగ్గరవుతున్నారు. అనంతరం ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేసి శారీరకంగా లోబచుకుంటున్నారు. తీరా తమ కోరిక తీరాక అసలు రంగు బయటపెడుతున్నారు. పెళ్లి పీటలు ఎక్కాలంటే తమకు భారీగా డబ్బు కావాలని, అదనపు కట్నం ఇస్తేనే తాళి కడతామని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే పెళ్లి రద్దు చేసుకుంటామని బెదిరింపులకు పాల్పడుతున్నారు.

Hyderabad CP Marriage Warning | పరువు పోతుందని..

నిశ్చితార్థం జరిగిపోవడం, బంధుమిత్రులందరికీ తెలిసిపోవడంతో.. ఇప్పుడు పెళ్లి ఆగిపోతే సమాజంలో తమ పరువు ఎక్కడ పోతుందోనన్న భయంతో చాలామంది యువతులు, వారి తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడం లేదు. వారు అడిగినంత ఇచ్చి పెళ్లి చేస్తున్నారు. పరువు పోతుంది అని భయపడి మౌనంగా ఉంటే, జీవితాంతం నరకం అనుభవించాల్సి వస్తుందని సీపీ పేర్కొన్నారు. నిశ్చితార్థం (Engagement) అయినా సరే, పెళ్లి పీటలు ఎక్కేవరకు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. యువతులు అబ్బాయి ప్రవర్తన, స్నేహితులు, అలవాట్లపై ఆరా తీయాలన్నారు. పెళ్లికి ముందే ఏకాంతంగా కలవడానికి, శారీరక సంబంధానికి ఒత్తిడి చేస్తే కచ్చితంగా అనుమానించాలన్నారు. శారీరకంగా దగ్గర కావొద్దన్నారు. డబ్బు డిమాండ్ చేసినా, బ్లాక్ మెయిల్ చేసినా తమకు ఫిర్యాదు చేయాలని సూచించారు.

Related articles

Trump Tariffs Suspended | రేపటి నుంచి నిలిచిపోనున్న ట్రంప్​ టారిఫ్​లు

పలు దేశాలపై అమెరికా విధించిన ప్రతీకార సుంకాలు రేపటి నుంచి నిలిచిపోనున్నాయి. ఈ మేరకు అధికారులు ప్రకటన విడుదల చేశారు.

ASHA Workers Arrest | సీఐటీయూ, ఆశకార్యకర్తల ముందస్తు అరెస్ట్​

బాన్సువాడ పట్టణంలో సీఐటీయూ నాయకులను, ఆశకార్యకర్తలను పోలీసులు అరెస్ట్​ చేశారు. అనంతరం పోలీస్​స్టేషన్​కు తరలించారు.

Soumya Government Job | ఎక్సైజ్ కానిస్టేబుల్​ గాజుల సౌమ్య సోదరుడికి ప్రభుత్వ ఉద్యోగం

విధినిర్వహణలో గంజాయి ముఠాను పట్టుకునే క్రమంలో ఎక్సైజ్​ కానిస్టేబుల్​ గాజుల సౌమ్య మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రభుత్వం ఆమె​ సోదరుడికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చింది.

TTD Laddu Case Verdict | టీటీడీ లడ్డూ కేసులో ప్రభుత్వానికి ఊరట..

టీటీడీ లడ్డూ కేసులో ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఏకసభ్య కమిటీ విచారణ కొనసాగించవచ్చని ధర్మాసనం పేర్కొంది.