Hyderabad
Hyderabad | కార్పొరేటర్​ వేధింపులు తాళలేక ఆత్మహత్య

అక్షరటుడే, వెబ్​డెస్క్ :Hyderabad | నగరాలు, పట్టణాల్లో ఇంటి నిర్మాణం చేపట్టాలంటే ఈ రోజుల్లో రూ.లక్షల లంచాలు ఇవ్వాల్సిందే. మున్సిపల్​ అధికారులు(Municipal officers), స్థానిక కార్పొరేటర్లు(local corporators), చోట మోటా లీడర్లు ఇలా వచ్చి డబ్బులు డిమాండ్ చేస్తారు. అడిగినంత ఇవ్వకపోతే ఇంటి నిర్మాణాన్ని అడ్డుకుంటారు. వారి చేతులు తడిపామా.. ఇంటి నిర్మాణంలో నిబంధనలు పాటించుకున్నా ఆ వైపు రారు. రాష్ట్రంలోని అన్ని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ఈ వ్యవహారం నడుస్తోంది. అయితే కార్పొరేటర్​ వేధింపులు తాళలేక తాజాగా ఓ వ్యక్తి ఆత్మహత్య(Suicide) చేసుకున్నాడు.

హైదరాబాద్​(Hyderabad)లోని బోరబండకు చెందిన మహ్మద్ సర్దార్ (35) బుధవారం ఆత్మహత్య చేసుకున్నాడు. కార్పొరేటర్ బాబా ఫసుద్దీన్(Corporator Baba Fasuddin), అతని భార్య హబీబా సుల్తానా, అధికారుల వేధింపులతోనే సర్దార్​ ఆత్మహత్య చేసుకున్నట్లు అతని సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. సర్దార్​ కుటుంబం ఇటీవల తమ ఇంటి పునరుద్ధరణ పనులు ప్రారంభించింది. దీంతో కొందరు వచ్చి వారిని లంచం అడిగారు. వారి కుటుంబం లంచం ఇవ్వడానికి నిరాకరించడంతో వేధింపులు ప్రారంభమయ్యాయి.

అధికారులు, కార్పొరేటర్​(Corporator) కలిసి వారిని వేధించడంతో పాటు మూడో అంతస్తును కూల్చి వేశారు. బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో మనోవేదనకు గురైన సర్దార్ ఇంటిపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోని తమకు న్యాయం చేయాలని సర్దార్​ కుటుంబ సభ్యులు కోరుతున్నారు.