Homeక్రైంhyderabad chutney murder case | చట్నీ మీద పడిందని నడి వయసు వ్యక్తిని దారుణంగా...

hyderabad chutney murder case | చట్నీ మీద పడిందని నడి వయసు వ్యక్తిని దారుణంగా హతమార్చిన కిరాతకులు

hyderabad chutney murder case | యువతలో నేర ప్రవృతి పెరిగిపోతోంది. తల్లిదండ్రుల పర్యవేక్షణ లేకపోవడం, మానవ నైతిక విలువలు తగ్గడం ఇందుకు ప్రధాన కారణంగా చెబుతున్నారు మానసిక శాస్త్రవేత్తలు.

- Advertisement -

అక్షరటుడే, హైదరాబాద్​: hyderabad chutney murder case | యువతలో నేర ప్రవృతి పెరిగిపోతోంది. తల్లిదండ్రుల పర్యవేక్షణ లేకపోవడం, మానవ నైతిక విలువలు తగ్గడం ఇందుకు ప్రధాన కారణంగా చెబుతున్నారు మానసిక శాస్త్రవేత్తలు Psychologists.

చట్నీ మీద పడిందని ఓ నడి వయసు వ్యక్తిని కిరాతంగా హతమార్చారు యువకులు. ఈ ఘటన తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్​ Telangana state capital Hyderabad పరిధిలో చోటుచేసుకుంది.

టిఫిన్​ చేస్తుండగా పొరపాటున చట్నీ మీద పడిన పాపానికి రెండు గంటలపాటు కారులో తిప్పుతూ.. సిగరెట్లతో కాల్చుతూ చివరికి కత్తితో కిరాతకంగా కడతేర్చారు నలుగురు యువకులు.

hyderabad chutney murder case | లిఫ్ట్​ అడిగడమే తప్పు..

హైదరాబాద్–నాచారం -Nacharam ప్రాంతంలో అర్ధరాత్రి 2 గంటలకు మహమ్మద్ జునైద్(18), షేక్ సైఫుద్దీన్(18), మణికంఠ(21), మరో బాలుడు(16) సరదాగా కారులో తిరుగుతున్నారు. కాగా, ఎల్బీ నగర్ వద్ద ఉప్పల్ ప్రాంతానికి చెందిన మురళి కృష్ణ(45) అనే వ్యక్తి లిఫ్ట్ అడిగాడు.

దారి మధ్యలో ఎన్జీఆర్ఐ ప్రాంతంలో యువకులతో కలిసి మురళి టిఫిన్ చేస్తుండగా.. ఒక యువకుడిపై అనుకోకుండా చట్నీ chutney పడింది.

దీంతో ఆగ్రహించిన యువకులు.. మురళి కృష్ణను కారులో బలవంతంగా ఎక్కించుకున్నారు. మా మీదే చట్నీ పోస్తావా అంటూ, పిడి గుద్దులు గుద్దుతూ నరకం చూపించారు యువకులు.

రెండు గంటలు కారులో తిప్పుతూ, సిగరెట్లతో కాల్చుతూ నరకం చూపించారు. చివరికి కత్తితో మురళి కృష్ణను పొడిచారు.

నిందితుల నుంచి తప్పించుకునేందుకు, కారు దూకి పారిపోతుండగా.. వెంబడించి మరీ హతమార్చారు కిరాతకులు.

మురళి కృష్ణ చనిపోయాడని నిర్ధారించుకుని, మార్గ మధ్యలో కత్తి పడేసి, మల్లాపూర్ కేఎల్ రెడ్డి నగర్ ప్రాంతంలో కారు పార్క్ చేసి యువకులు పారిపోయారు.

ఈ ఘటనను సీరియస్​గా తీసుకున్న పోలీసులు నిందితుల కోసం ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. పలు బృందాలుగా ఏర్పడి, సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా నిందితులను గుర్తించి, అరెస్టు చేసి రిమాండుకు తరలించారు.