అక్షరటుడే, హైదరాబాద్: Hyderabad Balkampet | విశ్వ నగరంగా ఎదుగుతున్న భాగ్యనగరంలో మౌలిక వసతులు ప్రధాన సమస్యగా మారాయి.
ముఖ్యంగా బల్కంపేట (Balkampet) డివిజన్‌లోని ప్రభుత్వ పాఠశాల సమీప వాసులు పలు సమస్యలతో సతమతమవుతున్నారు.
సమస్యల పరిష్కారం విషయంలో స్థానిక బల్దియా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తుండటంతో ఇక్కడి వారు సమస్యలతో సావాసం చేయాల్సిన దుస్థితి కొనసాగుతోంది.
Hyderabad Balkampet | మూడు నెలలుగా వెలగని వీధిదీపాలు..
ఇక్కడ మూడు నెలలుగా వీధిదీపాలు వెలగడం లేదు. ఫలితంగా రాత్రివేళల్లో చీకట్లో భయం గుప్పట్లో స్థానికులు కాలం వెళ్లదీస్తున్నారు. చిమ్మచీకట్లో ముఖ్యంగా మహిళలు, వృద్ధులు, పిల్లలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Hyderabad Balkampet | రోడ్డుపైనే చెత్తాచెదారం..
ఇక్కడ మరో ప్రధాన సమస్య చెత్త. నిత్యం చెత్తను రోడ్డుపైనే పారేస్తున్నారు. చెత్తకుండీలు లేకపోవడంతో ఈ సమస్య తలెత్తుతోంది.
పారిశుద్ధ్య కార్మికులు నిత్యం చెత్తను తొలగించకపోవడంతో దుర్వాసన వ్యాపిస్తోంది. ఫలితంగా ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారు.
ముఖ్యంగా సమీపంలోనే ఉన్న ప్రసిద్ధ ఎల్లమ్మ గుడికి వచ్చే భక్తులు, స్థానికులు ముక్కుమూసుకుని దైవ దర్శనం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటోంది.
Hyderabad Balkampet | రోడ్డుపైనే వాహనాల పార్కింగ్..
రోడ్లపై వాహనాల (Vehicles) ను పార్క్ చేస్తున్నారు. ఫలితంగా తరచూ ట్రాఫిక్ సమస్య తలెత్తుతోంది. ఈ సమస్యలపై స్థానికులు పలుమార్లు GHMC అధికారులకు, ట్రాఫిక్ traffic పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ, ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
ప్రజల ఆరోగ్యం (health), భద్రత (safety) దృష్ట్యా అధికారులు వెంటనే స్పందించి వీధిదీపాలు సరిచేయాలని కోరుతున్నారు.
చెత్త garbage సమస్యను పరిష్కరించాలని విన్నవిస్తున్నారు. రోడ్లపై వాహనాల పార్కింగ్‌పై చర్యలు తీసుకోవాలని స్థానికులు వేడుకుంటున్నారు.