అక్షరటుడే, వెబ్‌డెస్క్ : CM Revanth | హైదరాబాద్ hyderabad ఏఐ హబ్ AI Hubగా మారబోతుందని సీఎం రేవంత్‌రెడ్డి cm revanth reddy అన్నారు. నానక్‌రామ్‌గూడలో ఏర్పాటు చేసిన సొనాటా సాఫ్ట్‌వేర్ సంస్థ ఫెసిలిటీ సెంటర్ Sonata Software Company Facility Center ను సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పెట్టుబడుల విషయంలో తెలంగాణ దేశంలోనే నంబర్ వన్‌గా ఉందన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగ కల్పనలో కూడా తమ ప్రభుత్వం అగ్రస్థానంలో ఉందని చెప్పారు. యువతకు ఉద్యోగాలు సృష్టించడానికే పెట్టుబడులు తీసుకు వస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
CM Revanth | మరిన్ని ప్రపంచ స్థాయి ఈవెంట్లు
హైదరాబాద్ వేదికగా మిస్ వరల్డ్ పోటీలు Miss World competitions నిర్వహిస్తున్నట్లు సీఎం తెలిపారు. భవిష్యత్‌లో మరిన్ని ప్రపంచ స్థాయి ఈవెంట్లు తెలంగాణలో నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ రైజింగ్ telangana rising కార్యాచరణ ద్వారా పెట్టుబడుల సమీకరణతో పాటు అన్ని రంగాల్లో తెలంగాణ అభివృద్ధి కోసం పని చేస్తున్నట్లు తెలిపారు.
CM Revanth | రూ.3 లక్షల కోట్ల పెట్టుబడులు
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రానికి రూ.3 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చామని రేవంత్‌రెడ్డి తెలిపారు. లక్షకు పైగా ఉద్యోగాలు కల్పించామన్ఆనరు. దేశీయంగా, అంతర్జాతీయంగా పెట్టుబడుల ఆకర్షణలో తెలంగాణ అగ్రస్థానంలో ఉందన్నారు.
CM Revanth | సంక్షేమ కార్యక్రమాల అమలు
రాష్ట్రంలో పేదల సంక్షేమమే ధ్యేయంగా అనేక పథకాలు అమలు చేస్తున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ పథకాల గురించి ఆయన వివరించారు. డ్రై పోర్టు నిర్మాణం చేపట్టి, ఆంధ్రప్రదేశ్ సముద్ర ఓడరేవుతో అనుసంధానం చేస్తామని పేర్కొన్నారు. సంక్షేమ కార్యక్రమాలతో పాటు తమ ప్రభుత్వం పరిశ్రమలకు మద్దతు ఇస్తోందని తెలిపారు. దీంతో హైదరాబాద్‌లో అనేక ప్రముఖ కంపెనీలు తమ క్యాంపస్ లను విస్తరిస్తున్నాయని చెప్పారు.