- Advertisement -
Homeతెలంగాణmanufacturing fighter jets | యుద్ధ విమానాల తయారీ హబ్​గా హైదరాబాద్.. ప్రత్యేకత ఏంటంటే..

manufacturing fighter jets | యుద్ధ విమానాల తయారీ హబ్​గా హైదరాబాద్.. ప్రత్యేకత ఏంటంటే..

- Advertisement -

అక్షరటుడే, హైదరాబాద్: manufacturing fighter jets : తెలంగాణ(Telangana)లోని హైదరాబాద్‌ పరిశ్రమలు (Hyderabad industries) యుద్ధ విమానాల తయారీ దిశగా ముందడుగు వేశాయి. తేలికపాటి యుద్ధ విమానం తేజస్‌ మార్క్‌-1ఏ (light fighter aircraft Tejas Mark-1A) మధ్య భాగమే కాకుండా.. నూతనంగా అభివృద్ధి చేస్తున్న అడ్వాన్స్‌డ్‌ మీడియం కంబాట్‌ ఎయిర్‌ క్రాఫ్ట్‌ (ఆమ్కా) (Advanced Medium Combat Aircraft – AMCA)కి సంబంధించిన మొత్తం బాడీ హైదరాబాద్‌లోనే తయారవుతోంది. ఒకప్పుడు పూర్తిగా ప్రభుత్వ రక్షణ సంస్థలే ఉత్పత్తి చేసిన వీటిని ఆ ప్రమాణాల ప్రకారమే ప్రైవేటు సంస్థలు తయారు చేస్తూ తమ సామర్థ్యాన్ని నిరూపిస్తున్నాయి.

manufacturing fighter jets : ఆమ్కా తయారీ అవకాశాలు

అయిదో తరం స్టెల్త్‌ యుద్ధ విమానాన్ని సాకారం చేసే దిశగా ఎగ్జిక్యూషన్‌ నమూనాకు తాజాగా కేంద్ర సర్కారు ఆమోదం తెలిపింది. ఈ లోహ విహంగం డిజైన్‌ బెంగళూరులో జరిగింది. కాగా, హైదరాబాద్‌లోని వెమ్‌ టెక్నాలజీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (Vem Technologies Private Limited)లో బాడీ ఫ్యాబ్రికేషన్‌ చేపట్టారు. దీన్నే బెంగళూరు(Bengaluru)లో జరిగిన ఏరో ఇండియాలో మొదటిసారి ప్రదర్శించారు.

- Advertisement -

ప్రైవేటు సంస్థలకు పోటీ ప్రాతిపదికన ఆమ్కా తయారీ అవకాశాలను కేంద్ర ప్రభుత్వం కల్పించబోతోంది. దీని రూపకల్పనలో హైదరాబాద్‌ సంస్థకు అనుభవం ఉండటంతో తెలంగాణకే దక్కే అవకాశం ఉంటుంది. రాడార్, కాక్‌పిట్, ల్యాండింగ్‌ గేర్‌ (Radar, cockpit, landing gear)ను ఏడీఏ, హెచ్‌ఏఎల్‌, ఏవియానిక్స్ (ADA, HAL, Avionics) డెవలప్​ చేస్తోంది.

manufacturing fighter jets : తయారీకి మూడు నెలల సమయం

యుద్ధ విమానం తేజస్‌ మార్క్‌-1ఏకి వాయుసేన (Air Force) నుంచి ఇప్పటికే ఆర్డర్లు ఉన్నాయి. నౌకాదళం (Navy) సైతం వీటిని అడుగుతున్నట్లు రక్షణ వర్గాలు తెలిపాయి. తేజస్‌ మార్క్‌-1ఏ(Tejas Mark-1A)లో అయిదు భాగాలు ఉంటే.. అందులో మధ్య భాగాన్ని హైదరాబాద్​లోని వెమ్‌ టెక్నాలజీస్‌ అభివృద్ధి​ చేసింది. ప్రస్తుతం మరింత అధునాతన తేజస్‌ మార్క్‌-1ఏకి మధ్య భాగం సిద్ధం చేశారు. మొదటి ఉత్పత్తిని నేడు(మే 30)న హెచ్‌ఏఎల్‌కు అందజేయనున్నారు.

- Advertisement -
- Advertisement -
Must Read
Related News