అక్షరటుడే, వెబ్డెస్క్:Hyderabad Family Suicide | హైదరాబాద్ (Hyderabad) నగరంలో దారుణం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు.
అంబర్‌పేట (Amberpet)లో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఇంట్లో ఉరి వేసుకొని తనువు చాలించారు. ఏం కష్టం వచ్చిందో ఏమో గాని వారు ఒకేసారి ఆత్మహత్య చేసుకోవడంతో స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. మృతులను రామరాజు (55), మాధవి (50), శశాంక్ (24)గా పోలీసులు గుర్తించారు. ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానిస్తున్నారు. ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Hyderabad Family Suicide | తలుపులు తీయకపోవడంతో..
రామరాజు తన కుటుంబంతో కలిసి అంబర్పేటలో ఉంటున్నాడు. మంగళవారం ఉదయం ఎంతసేపటికి ఇంటి తలుపులు తీయకపోవడంతో స్థానికులు అనుమానంతో పిలిచారు. లోపలి నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి చూసే సరికి ముగ్గురు ఉరి వేసుకొని చనిపోయారు. కాగా ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా పోలీసులు క్లూస్ టీమ్ సాయంతో ఆధారాలు సేకరించారు. వారి బంధువులను విచారిస్తున్నారు. కాగా నగరంలో ఇటీవల ఓ మహిళ తన ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఇలాంటి ఘటనలు పెరగడం ఆందోళన కలిగిస్తోంది.
