అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Hyderabad Inspectors Transfers | హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ (Hyderabad Police Commissionerate) పరిధిలో భారీగా ఇన్స్పెక్టర్లు బదిలీ అయ్యారు. ఈ మేరకు నగర కమిషనర్ వీసీ సజ్జనార్ (Commissioner VC Sajjanar) ఉత్తర్వులు జారీ చేశారు.
నగర వ్యాప్తంగా మొత్తం 63 మంది ఇన్స్పెక్టర్లను సీపీ బదిలీ చేశారు. స్పెషల్ బ్రాంచ్‌లో పని చేస్తున్న పలువురిని వివిధ ఠాణాల ఎస్హెచ్వోలుగా పంపించారు. వెయిటింగ్లో ఉన్న వారికి పోస్టింగ్ ఇచ్చారు. పలు పోలీస్ స్టేషన్ల ఎస్‌హెచ్‌వోలను స్పెషల్ బ్రాంచ్‌కు ట్రాన్స్ఫర్ చేశారు. ట్రాఫిక్, హెచ్ న్యూ, సైబర్ క్రైం విభాగాల్లో బదిలీలు చేశారు.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కమిషన్ ఎన్నికలు (Municipal Commission Elections) త్వరలో జరగనున్నాయి. మున్సిపల్ ఎన్నికల్లో గెలుపుతో ఊపు మీదున్న కాంగ్రెస్ జీహెచ్ఎంసీ ఎన్నికలు (GHMC Elections) సైతం నిర్వహించాలని చూస్తోంది. ఈ క్రమంలో ఒకేసారి 63 మంది ఇన్స్పెక్టర్లు బదిలీ కావడం గమనార్హం. స్పెషల్ బ్రాంచ్‌లో పని చేస్తున్న టి. రాంబాబు, రామకృష్ణ, లక్ష్మీనారాయణ రెడ్డి, రుక్మిణి, రాజగోపాల్ రెడ్డి, నగేశ్, వెంకట గిరి వరుసగా.. చార్మినార్, చిలకలగూడ, పహడి షరీఫ్, అసిఫ్‌నగర్, ముషీరాబాద్, డబ్ల్యూఎస్‌డబ్ల్యూ, సీటీసీకి ట్రాన్స్ఫర్ అయ్యారు.