అక్షరటుడే, కామారెడ్డి: Husband wife victory in Kamareddy | కామారెడ్డి మున్సిపాలిటీ (Kamareddy Municipality) చరిత్రలో కౌన్సిలర్లుగా భార్యాభర్తలు మొదటిసారి విజయం సాధించారు. ఇద్దరు కూడా బీఆర్ఎస్ (Kamareddy BRS) పార్టీ తరఫున పోటీచేసి గెలుపొందారు. కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని 47వ వార్డులో గత మున్సిపల్ ఎన్నికల్లో(Municipal election) గెరిగంటి స్వప్న పోటీ చేసి గెలుపొందారు. ఈ ఎన్నికల్లో సైతం ఆమె అదే వార్డు నుంచి మరోసారి పోటీ చేసి విజయం సాధించారు.
Husband wife victory in Kamareddy | 46వ వార్డు నుంచి భర్త..
స్వప్న భర్త గెరిగంటి లక్ష్మీనారాయణ 46వ వార్డులో పోటీ చేశారు. ఆ వార్డులో అధికార పార్టీ అభ్యర్థి, సిట్టింగ్ కౌన్సిలర్ కన్నయ్యపై 400 ఓట్లకు పైగా భారీ మెజారిటీతో గెరిగంటి లక్ష్మీనారాయణ విజయ బావుటా ఎగురవేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా భార్యాభర్తలు ఒకే పార్టీ నుంచి పోటీ చేయడం, అదికూడా పక్కపక్క వార్డుల్లో పోటీ చేసి బంపర్ మెజారిటీతో గెలుపొందడం గమనార్హం. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తమపై నమ్మకంతో ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించిన రెండు వార్డుల ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.