ePaper
More
    Homeజిల్లాలుకరీంనగర్Rajanna Siricilla | చచ్చిపోమ్మన్న భార్య.. అవమానంతో భర్త ఆత్మహత్య

    Rajanna Siricilla | చచ్చిపోమ్మన్న భార్య.. అవమానంతో భర్త ఆత్మహత్య

    Published on

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Rajanna Siricilla : పరాయి స్త్రీ మోజులో కొందరు కట్టుకున్న భార్యను చిత్రహింసలకు గురిచేస్తుంటే.. అంతేస్థాయిలో పరాయి పురుషుల వ్యామోహంలో భర్తను భార్యలు మోసగిస్తున్నారు. కుటుంబమే తన బలంగా, వారి కోసం తన జీవితాన్ని, సంతోషాలను త్యాగం చేస్తూ ఎడారి దేశంలో కష్టపడుతున్న యువకులు, మగవారు ఎందరో ఉన్నారు. వారి కష్టాన్ని గుర్తించిన భార్యలు కుటుంబానికి పెద్ద దిక్కుగా నిలబడి అతనికి అండగా నిలుస్తుంటే.. మరికొందరు అతివలు తమ అమాయక భర్తలను నిలువునా మోసగిస్తున్నారు.

    రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్‌పల్లి మండలం(Boyinpally mandal) తడగొండ గ్రామం(Tadagonda village)లో భార్య మాటలతో మనస్తాపానికి గురైన ఓ భర్త బలవంతంగా తనువు చాలించాడు. 2014లో గ్రామానికి చెందిన హరీశ్ (36) అనే వ్యక్తికి, కరీంనగర్ జిల్లా(Karimnagar district) బద్దిపెల్లి కి చెందిన యువతితో పెళ్లి జరిగింది. వీరికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు.

    కుటుంబ family ఆర్థిక అవసరాల కోసం హరీశ్ దుబాయి(Dubai)కి వెళ్లాడు. కాగా, ఆ సమయంలో అతని భార్య.. ఇదే గ్రామానికి చెందిన ఓ యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకున్నట్లు బాధిత కుటుంబీకులు ఆరోపిస్తున్నారు.

    కాగా, ఈ విషయం తెలిసిన హరీశ్ తన భార్యతో ఫోన్‌లో వాగ్వాదానికి దిగాడు. అనంతరం జూన్ 8న హరీశ్​ స్వదేశానికి తిరిగొచ్చాడు. తన భార్యను మందలించడంతో ఆమె, అతడితో వాగ్వాదానికి దిగింది. “నువ్వు నాకొద్దు.. చచ్చిపో..! నేను అతనితోనే ఉంటాను” అని తేల్చి చెప్పింది.

    అయితే, ఆమె మాటలు హరీశ్ మనసును తీవ్రంగా గాయపర్చాయి. తీవ్ర అవమానంగా భావించిన ఆయన జీవితంపై విరక్తితో ఇంటి సమీపంలోని వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

    తన కుమారుడి మృతితో అతడి తల్లిదండ్రుల గుండెలు ద్రవించిపోయాయి. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు భార్య, ఆమె ప్రియుడిపై పోలీసులు Police నమోదు చేశారు. ఒక అమాయకుడిని బలిగొన్న ఇలాంటి నీచులను కఠినంగా శిక్షించాలని స్థానికులు కోరుతున్నారు.

    More like this

    Urea Shortage | యూరియా కొర‌త‌కు బీజేపీదే బాధ్య‌త‌.. మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్‌

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Urea Shortage | తెలంగాణ‌లో యూరియా కొర‌తకు కార‌ణం బీజేపీయేన‌ని మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్...

    HMDA | హెచ్​ఎండీఏ కార్యాలయం వద్ద ఉద్రిక్తత.. ఆందోళన చేపట్టిన ఆర్​ఆర్​ఆర్​ భూ నిర్వాసితులు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : HMDA | హైదరాబాద్ (Hyderabad)​ చుట్టూ రీజినల్​ రింగ్​ రోడ్డు (RRR) నిర్మాణానికి రాష్ట్ర...

    Ganesh immersion | ఎల్లారెడ్డిలో ప్రశాంతంగా ముగిసిన వినాయక నిమజ్జనం

    అక్షరటుడే, ఎల్లారెడ్డి: Ganesh immersion | పట్టణంలో ఆదివారం రాత్రి వినాయక నిమజ్జనోత్సవం ప్రశాంతంగా ముసిగింది. 11 రోజులుగా...