HomeUncategorizedJharkhand | భార్య‌ను చ‌దివించ‌డం కోసం లోన్ తీసుకున్న భ‌ర్త‌.. ఉద్యోగం రాగానే ల‌వ‌ర్‌తో భార్య‌...

Jharkhand | భార్య‌ను చ‌దివించ‌డం కోసం లోన్ తీసుకున్న భ‌ర్త‌.. ఉద్యోగం రాగానే ల‌వ‌ర్‌తో భార్య‌ జంప్​

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: Jharkhand | ఇటీవల దేశ‌ వ్యాప్తంగా చోటు చేసుకుంటున్న కొన్ని సంఘటనలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. వివాహేతర సంబంధాలు పచ్చని కాపురాలను నాశనం చేస్తున్నాయి. పెళ్లి చేసుకున్న అనంతరం భర్తలను మోసం చేస్తూ హత్యలకు పాల్పడుతున్న ఘటనలు ఇటీవల వెలుగుచూస్తున్నాయి.

ఇటీవల మేఘాలయలో హనీమూన్​ పేరిట తీసుకెళ్లి ప్రియుడితో భర్తను వివాహిత హత్య చేయించిన ఘటన సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అంతేకాకుండా హర్యానా(Haryana)లోనూ మగన్ అనే యువకుడు భార్య, ఆమె ప్రియుడి వేధింపులకు తాళలేక ఆత్మహత్య చేసుకున్న ఘటన కలిచివేసింది. భార్య తమ స్వప్రయోజనాల కోసం భర్తను హత్య చేయమని ఒత్తిడి చేసింది, ఆస్తిని అమ్మమ‌ని చెప్పింది, చివరికి అతని జీవితాన్ని నాశనం చేసింది. ఇటువంటి ఘటనలు దేశంలో పలుచోట్ల కనిపిస్తున్నాయి.

తాజాగా జార్ఖండ్(Jharkhand) రాష్ట్రంలో జ‌రిగిన ఈ సంఘ‌ట‌న విస్తుపోయేలా చేసింది. ఓ భర్త తన భార్యను నర్సింగ్​ కోర్సు చదవించగా.. ఉద్యోగం రాగానే ఆమె ల‌వ‌ర్​తో లేచిపోయింది. వివ‌రాల్లోకి వెళ్తే.. జార్ఖండ్ రాష్ట్రంలో ఓ వ్య‌క్తి పిజ్జా డెలివ‌రీ (Pizza Delivery boy) బాయ్​గా వ‌ర్క్ చేస్తున్నాడు. అయితే అత‌నికి పెళ్లి కాగా.. భార్య‌ని న‌ర్సింగ్ కోర్సు చేయించేందుకు రూ. రెండున్న‌ర ల‌క్ష‌లు లోన్(Loan) తీసుకున్నాడు. నర్సింగ్​ కోర్సలు చేసిన భార్య ఇక కొద్ది రోజుల త‌ర్వాత జాబ్ సంపాదించింది. జాబ్​ రాగానే వేరే వ్య‌క్తితో వెళ్లిపోయింది. గత కొద్దిరోజులుగా వెలుగు చూస్తున్న ఇలాంటి సంఘ‌ట‌న‌లు చాలా మంది య‌వ‌కుల‌లో పెళ్లంటే భ‌యం క‌లిగేలా చేస్తున్నాయి.