అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Nizamabad City | భార్యను వేధించి, ఆత్మహత్యకు కారకుడైన భర్తకు న్యాయస్థానం జైలుశిక్ష విధించింది. వివరాల్లోకి వెళ్తే.. గాంధారి మండలం (Gandhari mandal) చద్మల్ గ్రామానికి చెందిన మౌనికకు మంచిప్ప గ్రామానికి చెందిన సాయికుమార్‌తో ఏడేళ్లక్రితం వివాహమైంది. అయితే వివాహమయ్యాక అనేకమార్లు భార్యభర్తల మధ్య గొడవలు జరిగాయి. భర్త తీరు మారకపోవడం, ఆయన వేధింపులు ఎక్కువ కావడంతో మౌనిక 2023 ఆగస్ట్ 28వ తేదీన ఆత్మహత్యకు పాల్పడింది. ఆమెకు కుమారుడు ఉన్నాడు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేశారు. కేసు పూర్వపరాలు పరిశీలించిన జిల్లా న్యాయమూర్తి భరత లక్ష్మీ (District Judge Bharatha Lakshmi).. మౌనిక ఆత్మహత్యకు కారణమైన భర్త సాయికుమార్‌కు పదేళ్ల జైలు శిక్ష విధించింది. అలాగే భార్యను వేధించిన కేసులో మూడేళ్ల సాధారణ జైలుశిక్ష విధించారు. అలాగే రూ. వెయ్యి జరిమానా వేశారు. ఈ కేసులో సాయికుమార్ తల్లిని నిర్దోషిగా పేర్కొంటూ తీర్పునిచ్చారు.