అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Medchal | మేడ్చల్ జిల్లా మేడిపల్లిలో (Medipally) దారుణ ఘటన చోటు చేసుకుంది. ప్రియుడి మోజులో కట్టుకున్న భర్తను కడతేర్చింది ఓ మహిళ.
మేడిపల్లి బృందావన్ కాలనీలో అశోక్, పూర్ణిమ దంపతులు నివసిస్తున్నారు. ఇంట్లోనే ప్లే స్కూల్ నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. అయితే ఈ నెల 12న అశోక్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ప్లే స్కూల్ అయిపోయిన తర్వాత రెస్ట్ తీసుకోవడానికి వెళ్లిన ఆయన తర్వాత అపాస్మకర స్థితిలోకి వెళ్లాడని పూర్ణిమ తెలిపింది. ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే చనిపోయాడని చెప్పింది. గుండెపోటుతో (heart attack) తన భర్త చనిపోయాడని, ఎలాంటి అనుమానం లేదని పోలీసులకు చెప్పింది. అయితే అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు పోస్ట్‌మార్టం చేయించారు.
Medchal | విషప్రయోగం జరిగిందని..
పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో (post-mortem report) అశోక్‌పై విష ప్రయోగం జరిగిందని వచ్చింది. దీంతో ఆయన భార్యపై అనుమానంతో పోలీసులు విచారణ చేపట్టగా అసలు నిజం తెలిసింది. పూర్ణిమకు మహేశ్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉన్నట్లు గుర్తించారు. భర్తను అడ్డు తొలగించుకొని అతడితో ఉండాలని పక్కా ప్లాన్ ప్రకారం హత్య చేసినట్లు గుర్తించారు. ఇద్దరు కలిసి హత్యకు ప్రణాళిక వేశారన్నారు. ఈ మేరకు ఆమెను అదుపులోకి తీసుకొని విచారించగా నేరం ఒప్పుకుంది. దీంతో నిందితురాలిని అరెస్ట్ చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Medchal | పెరుగుతున్న హత్యలు
ఇటీవల దేశంలో వివాహేతర సంబంధం, ప్రేమ పేరిట హత్యలు పెరుగుతున్నాయి. ప్రియుడి మోజులో కొందరు కట్టుకున్న వారిని కడతేరుస్తున్నారు. ప్రియురాలి కోసం కొందరు భార్యలను చంపుతున్నారు. తాత్కాలిక ఆనందం కోసం హత్యలు చేసి జైలు పాలు అవుతున్నారు. జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.