అక్షరటుడే, పెద్ద కొడప్‌గల్ : Pedda Kodapgal | మండలంలోని విఠల్‌వాడి తండాలో (Vitthalwadi Thanda) మద్యం మత్తులో ఓ వ్యక్తి భార్యను హత్య చేశాడు. పోలీసుల కథనం ప్రకారం.. విఠల్ తండాకు చెందిన కిసాన్‌కు సవితతో 25 ఏళ్ల కిందట వివాహం జరిగింది.
వీరికి ఒక కొడుకు, కూతురు ఉండగా బతుకుదెరువు కోసం హైదరాబాద్‌లో (Hyderabad) టీ కొట్టు నడుపుతున్నారు. ఈ క్రమంలో ఇటీవల పండుగ సందర్భంగా తండాకు రాగా, మద్యానికి బానిసైన కిసాన్ గురువారం రాత్రి భార్యతో గొడవ పడ్డాడు. కోపంలో భార్యపై రుబ్బురాయితో మోదగా, ఆమె తలకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు బాన్సువాడ ఆసుపత్రికి తరలిస్తుండగా, మార్గమధ్యలో మృతి చెందింది. మృతురాలి సోదరుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు బిచ్కుంద సీఐ రవికుమార్, ఎస్సై అరుణ్ కుమార్ తెలిపారు.
