అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : Nizamabad | నిజామాబాద్ నగరం (Nizamabad City)లోని నాలుగో టౌన్ (Fourth Town) పరిధిలో గల టెలికం కాలనీకి చెందిన నిఖితను భర్త నరేష్ హత్య చేశాడు. నరేశ్, నిఖిత మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఆదివారం రాత్రి కూడా వారు గొడవపడ్డారు. ఆవేశానికి గురైన నరేష్ భార్యను గట్టిగా కొట్టాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. నాలుగో టౌన్ ఎస్సై శ్రీకాంత్ (Fourth Town SI Srikanth) సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.