ePaper
More
    HomeతెలంగాణHyderabad | కిడ్నాపర్ల చెరలో భర్త.. రూ.10 లక్షలు డిమాండ్​.. ఇవ్వనని తేల్చి చెప్పిన భార్య..!

    Hyderabad | కిడ్నాపర్ల చెరలో భర్త.. రూ.10 లక్షలు డిమాండ్​.. ఇవ్వనని తేల్చి చెప్పిన భార్య..!

    Published on

    అక్షరటుడే, హైదరాబాద్: Hyderabad : అతడిని అమ్మాయి పబ్​కి ఆహ్వానించింది. మత్తులో ముంచింది. టాస్క్​ ఫోర్స్​ పోలీసులను బెదిరించింది. ఓ ముఠా సాయంతో రూ.10 లక్షలు లాగడానికి ప్రయత్నించింది. చివరికి పోలీసులకు చిక్కింది.

    పోలీసుల కథనం ప్రకారం.. రంగారెడ్డి జిల్లా (Rangareddy district) అత్తాపూర్(Attapur)​లో ఉంటున్న సచిన్​ దూబే బంజారాహిల్స్​లోని ఓ జ్యువెల్లరీ (jewellery) షాపులో అకౌంటెంట్​గా విధులు నిర్వర్తిస్తున్నాడు. కాగా, మనోడికి పబ్​లకు వెళ్తుంటాడు.

    హైదరాబాద్​లోని కూకట్​పల్లి (Kukatpally) లో ఉన్న “కింగ్స్ అండ్ క్వీన్స్” పబ్ (Kings and Queens” pub) ​లో డింపుల్ యాదవ్ అనే అమ్మాయి డ్యాన్సర్​గా పని చేస్తోంది. ఇక, విషయం ఏమిటంటే.. దూబేకు ఈ డింపుల్​ పరిచయం అయింది. అయితే వక్రబుద్ధి కలిగిన డింపుల్​.. దూబేను అడ్డుపెట్టుకుని అందలం ఎక్కాలని చూసింది.

    READ ALSO  Musi River | మూసీ నదిని ఆక్రమించి షెడ్ల నిర్మాణం.. కూల్చివేతలు చేపట్టిన హైడ్రా

    అలా ప్లాన్​ ప్రకారం.. డింపుల్ జులై 19న దూబేకు ఫోన్ చేసి పబ్​కు రమ్మని ఆహ్వానించింది. సచిన్ తన వాహనాన్ని దూరంగా పార్క్​ చేసి పబ్​కు వెళ్లాడు. అక్కడ అతడికి దూబే ఫూటుగా తాగించింది. అర్ధరాత్రి పబ్​ మూసేశాక, దూబేను తన బైక్​ ఎక్కించుకుని బయలుదేరింది.

    Hyderabad : కిడ్నాప్​ డ్రామా..

    బంజారాహిల్స్(Banjara Hills) రోడ్ నంబరు 3 వద్దకు చేరుకున్నారు. అక్కడికి ఫార్చ్యూనర్ కారులో వచ్చిన నలుగురు వ్యక్తులు దూబేను కారులో ఎక్కించుకుని తీసుకెళ్లారు. అతడికి మత్తు మందు ఇచ్చి, నగ్నంగా ఫొటోలు, వీడియోలు తీశారు. దూబే వద్ద ఉన్న బంగారు గొలుసు, ఇతర వస్తువులను లాగేసుకున్నారు.

    మత్తు వదిలాక అతడిని బెదిరించడం మొదలెట్టారు. డింపుల్​ను నువ్వు చంపేశావని, రూ. 10 లక్షలు ఇవ్వాలని డిమాండ్​ చేశారు. వారి ఒత్తిడి తాళలేక భార్యకు ఫోన్​ చేశాడు. తనను కిడ్నాప్​ చేశారని, డబ్బులు సర్దాలని కోరాడు.

    READ ALSO  Operation Muskan | ఆపరేషన్​ ముస్కాన్​లో 7,678 మంది చిన్నారులను రక్షించిన పోలీసులు

    Hyderabad : భయపడకుండా ధైర్యంగా సమాధానమిచ్చిన భార్య..

    కానీ, డబ్బులు ఇవ్వడానికి దూబే భార్య ససేమిరా అంది. ఒక్క రూపాయి కూడా ఇవ్వనని తేల్చి చెప్పింది. దీంతో అతడిని దగ్గర ఉంచుకుని ఫలితం లేదని భావించిన దుండగులు దూబేను వదిలిపెట్టారు.

    ఇంటికి చేరుకున్నాక తన భార్యకు జరిగిన విషయాన్ని దూబే చెప్పాడు. దీంతో ఇరువురు కలిసి జులై 26న పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు బంజారాహిల్స్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితురాలు డింపుల్​ను అదుపులోకి తీసుకుని విచారించగా.. దిమ్మతిరిగే విషయాలు వెలుగులోకి వచ్చాయి.

    డింపుల్ తన భర్త (Husband) పవన్ కుమార్​తో కలిసి ఈ కిడ్నాప్​ ప్లాన్​ వేశారు. సచిన్ దూబే​ నుంచి భారీగా డబ్బు లాగాలని అనుకున్నారు. వీరికి హరికిషన్​, సాయి ప్రసాద్, సుబ్బారావు జత కలిశారు. కానీ, దూబే భార్య డబ్బులు ఇవ్వకపోవడంతో వీరి ప్లాన్​ బెడిసికొట్టింది. నిందితులను పోలీసులు అరెస్టు చేసి, రిమాండ్​కు తరలించారు.

    READ ALSO  Mla Dhanpal | కమ్యూనిటీ హాల్ నిర్మాణం.. అభినందనీయం

    Latest articles

    Railway Line | ఉత్తరాదికి మరింత వేగంగా రైళ్లు.. కాజీపేట–బల్లార్షా మార్గంలో త్వరలో నాలుగో రైల్వే లైన్​

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Railway Line | తెలంగాణ నుంచి ఇక ఉత్తరాది రైళ్లు మరింత వేగంగా దూసుకు...

    Bodhan | హాస్టళ్లలో పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలి.. లేదంటే చర్యలు తప్పవు: బోధన్​ మున్సిపల్ కమిషనర్​

    అక్షరటుడే, బోధన్ : Bodhan | ప్రభుత్వ వసతి గృహాల్లో విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించేందుకు ప్రభుత్వం రూ....

    Weather Updates | రాష్ట్రానికి నేడు వర్ష సూచన

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Weather Updates | రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో శనివారం తేలికపాటి వర్షాలు (Scattered Rains)...

    Meenakshi Natarajan padayatra | మీనాక్షి నటరాజన్ పాదయాత్ర.. బీఆర్ఎస్ నాయకుల ముందస్తు అరెస్టు

    అక్షరటుడే, ఆర్మూర్: తెలంగాణ కాంగ్రెస్ ఇన్​ఛార్జి మీనాక్షి నటరాజన్ పాదయాత్ర నేపథ్యంలో బీఆర్ఎస్ నాయకులను పోలీసులు ముందస్తు అరెస్ట్​...

    More like this

    Railway Line | ఉత్తరాదికి మరింత వేగంగా రైళ్లు.. కాజీపేట–బల్లార్షా మార్గంలో త్వరలో నాలుగో రైల్వే లైన్​

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Railway Line | తెలంగాణ నుంచి ఇక ఉత్తరాది రైళ్లు మరింత వేగంగా దూసుకు...

    Bodhan | హాస్టళ్లలో పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలి.. లేదంటే చర్యలు తప్పవు: బోధన్​ మున్సిపల్ కమిషనర్​

    అక్షరటుడే, బోధన్ : Bodhan | ప్రభుత్వ వసతి గృహాల్లో విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించేందుకు ప్రభుత్వం రూ....

    Weather Updates | రాష్ట్రానికి నేడు వర్ష సూచన

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Weather Updates | రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో శనివారం తేలికపాటి వర్షాలు (Scattered Rains)...