Homeజిల్లాలునిజామాబాద్​Sirikonda | భార్య అన్నం పెట్టలేదని అలిగి కరెంట్ పోల్​ ఎక్కిన భర్త

Sirikonda | భార్య అన్నం పెట్టలేదని అలిగి కరెంట్ పోల్​ ఎక్కిన భర్త

అక్షరటుడే, సిరికొండ : Sirikonda | ఇంట్లో భార్య అన్నం పెట్టలేదని అలిగి కరెంట్​ స్తంభం ఎక్కాడు ఓ భర్త. ఈ ఘటన సిరికొండ (Sirikonda) మండలంలో మంగళవారం చోటు చేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సిరికొండ మండలం చీమన్​పల్లి గ్రామానికి (Cheemanpally Village) చెందిన అలకుంట సుమన్​ వడ్డెర వృత్తి చేస్తూ జీవిస్తున్నాడు. అయితే మంగళవారం ఇంట్లో భార్యతో జరిగిన గొడవ కారణంగా ఆమె అతడికి భోజనం పెట్టలేదు. దీంతో అలిగిన భర్త సుమన్ తాగిన మైకంలో గ్రామంలో ఉన్న​ విద్యుత్​ స్తంభం (Electricity Pole) ఎక్కాడు. స్థానికులు ఎంత నచ్చజెప్పినా వినలేదు. దీంతో వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి హుటాహుటిన చేరుకున్న పోలీసులు అతడికి నచ్చజెప్పి కిందికి దించారు. దీంతో పోలీసులు, గ్రామస్థులు ఊపిరి పీల్చుకున్నారు.