అక్షరటుడే, వెబ్డెస్క్ : Viral Video | వివాహేతర సంబంధాలు ఎన్నటికీ దాగవు అన్నదానికి మరోసారి నిదర్శనంగా నిలిచే ఘటన ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. భార్య భర్తకు తెలియకుండా తన ప్రియుడిని ఇంట్లోకి రహస్యంగా పిలిపించుకుని, అతన్ని మంచం కింద దాచిన సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చర్చకు దారి తీసింది.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం లక్షలాది మంది దృష్టిని ఆకర్షించింది. వైరల్ వీడియో(Viral Video)లో కనిపించిందేమిటంటే .. ఓ ఇంట్లో కొందరు వ్యక్తులు చేతుల్లో కర్రలు పట్టుకొని హడావుడిగా వచ్చారు. ‘‘పాము(Snake) దూరిందన్న అనుమానంతో’’ వారు ఇల్లు అంతా గాలించసాగారు. అంతలోనే, మంచం కింద చూస్తే షాకింగ్ సీన్.
Viral Video | ఇలా భయటపడింది..
మంచం కింద ఒక యువకుడు దాగి ఉన్నాడు. దీనితో ఆ వ్యక్తిని బయటకు లాగి, అక్కడే ఉన్న వ్యక్తులు కర్రలతో చితకబాదారు. ఈ సమయంలో పలువురు మహిళలు అతనిపై కోపం వ్యక్తం చేస్తూ గొడవకు దిగారు. వీడియోలో కనిపించిన దృశ్యాల ప్రకారం, భర్తకు తెలియకుండా భార్య తన ప్రియుడిని ఇంట్లోకి పిలిపించుకుని మంచం కింద దాచినట్టు సమాచారం. ఈ విషయం భర్తకు తెలియడంతో, అతడు స్నేహితులతో కలిసి అక్కడకు వెళ్లి ఈ దృశ్యాన్ని బయటపెట్టినట్టు తెలుస్తోంది.ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో 1.1 మిలియన్ వ్యూస్, 3,700కి పైగా లైక్స్ ను సాధించింది. వీడియోపై నెటిజన్లు కూడా విభిన్నంగా స్పందిస్తున్నారు.
ఇలాంటి వారివల్లే కుటుంబాలు పాడవుతున్నాయి’, ‘‘వివాహేతర సంబంధాలు(Extramarital Affairs) ఎప్పటికైన బయటపడతాయి, ఇది పాపం భర్తకి చేసిన ద్రోహం అంటూ కొందరు ఫన్నీ ఎమోజీలతో కూడా కామెంట్లు చేస్తున్నారు. ఇలాంటి సంఘటనలు తరచూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నప్పటికీ, వివాహేతర సంబంధాలు ఇంకా సమాజంలో పెద్ద సమస్యగా మారుతున్నాయి. ఇలాంటి చర్యలు కుటుంబ వ్యవస్థలని దెబ్బతీసేలా ఉన్నాయి.
पहली बार तो लगा सांप पकड़ने आया है फिर लास्ट में कुछ और पकड़ा गया👇🧘♀️🥵🤭 pic.twitter.com/jQqockm7Lz
— it’s sammy (dream girl) (@cute_sam_000) September 23, 2025