అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Hyderabad | సమాజంలో వివాహేతర సంబంధాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. కట్టుకున్న వారిని కాదని పలువురు మరొకరి పంచన చేరుతున్నారు. అంతేగాకుండా ప్రియుడి మోజులో కొంత మంది మహిళలు కట్టుకున్న వాడిని కడతేరుస్తున్నారు. వివాహేతర సంబంధం కోసం కొంత మంది భార్యలను హత్య చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఇటీవల ఇలాంటి ఘటనలు పెరిగాయి. తాజాగా ఓ వ్యక్తి ప్రియురాలితో బిజీగా ఉండగా.. భార్య రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది.
పెళ్లయి కుమారుడు ఉన్న వ్యక్తి మరో యువతితో ప్రేమ వ్యవహారం నడుపుతున్నాడు. అంతేకాదు సెపరేట్ రూమ్ తీసుకొని ఆమెతో గడుపుతున్నాడు. ఈ విషయాన్ని గమనించిన భార్య శనివారం భర్తను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. అనంతర ఇద్దరికీ దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించింది. ఈ ఘటన హైదరాబాద్ నగరంలోని నార్సింగి పోలీస్ స్టేషన్ (Narsingi Police Station) పరిధిలో గల గంధంగూడలో చోటు చేసుకుంది.
Hyderabad | రెండేళ్ల క్రితం నుంచి..
హైదరాబాద్ (Hyderabad) నగరానికి చెందిన వేణు కుమార్, శిరీషలకు 13 ఏళ్ల క్రితం పెళ్లయింది. ఈ దంపతులకు ఏడేళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. అయితే వేణు భార్యకు తెలియకుండా మరో యువతితో ప్రేమ (Love) వ్యవహారం నడుపుతున్నాడు. రెండేళ్ల నుంచి ఆయన ప్రవర్తనలో మార్పు వచ్చినట్లు భార్య చెప్పింది. మరొక యువతితో సంబంధం పెట్టుకున్న ఆయన నిత్యం భార్యతో గొడవ పడేవాడు. ఈ క్రమంలో శిరీష భర్తపై అనుమానంతో నిఘా పెట్టింది. దీంతో మౌనిక అనే యువతితో తన భర్త సంబంధం పెట్టుకున్నట్లు ఆమె గుర్తించింది. ఒక గది అద్దెకు తీసుకొని ఆమెతో కలిసి ఉంటున్నాడని తెలుసుకొని షాక్ అయింది. శనివారం తన కుటుంబ సభ్యులతో కలిసి అక్కడికి వెళ్లింది. ఫ్లాట్‌కు వెళ్లి చూడగా.. తన భర్త మరో యువతితో ఉన్నాడు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఆమె ఇద్దరికి దేహశుద్ధి చేసింది. అనంతరం పోలీసులకు అప్పగించింది.