అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Bhupalapally | వివాహేతర సంబంధం కోసం కొందరు కట్టుకున్న వారిని, కడుపున పుట్టిన పిల్లలను కడ తేరుస్తున్నారు. తాత్కాలిక ఆనందం, సుఖాల కోసం ప్రాణాలు తీయడానికి వెనకాడటం లేదు.
వివాహేతర సంబంధాల మోజులో కొందరు మహిళలు భర్తలను హత్య చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు ఇటీవల తరుచు వెలుగు చూస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా ఓ మహిళ యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. అంతేగాకుండా తన భర్తను, 22 ఏళ్ల కూతురును హత్య చేసింది. ఈ ఘటన జయశంకర్ భూపాలపల్లి (Bhupalapally) జిల్లా చిట్యాల మండలం వడితల గ్రామంలో చోటు చేసుకుంది.
Bhupalapally | భర్తకు తెలుస్తుందని..
గ్రామానికి చెందిన కవిత భర్త పక్షవాతంతో బాధ పడుతుండేవాడు. ఈ క్రమంలో ఆమె స్థానికంగా ఉండే ఓ యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఆ విషయం ఎక్కడ భర్తకు తెలుస్తుందోనని భయపడింది. దీంతో జూన్ 25న భర్తను హత్య చేసింది. అప్పటికే ఆయన అనారోగ్యంగా బాధ పడుతుండటంతో అదే కారణంతో చనిపోయాడని బంధువులు, గ్రామస్తులను నమ్మించింది. అనంతరం సొంత కూతురిని సైతం హతమార్చడానికి ప్లాన్చేసింది.
Bhupalapally | క్షుద్రపూజలు చేసినట్లు..
కవిత తన వివాహేతర సంబంధం విషయం కూతురుకు తెలుస్తుందేమోనని భయపడింది. దీంతో ప్రియుడితో కలిసి కూతురు వర్షిణి(22)ని హత్య చేసింది. ఆమె మృతదేహాన్ని భూపాలపల్లి – కాటారం (Kataram) హైవే పక్కన అడవిలో పడేసింది. తన మీద అనుమానం రాకుండా ఉండటానికి.. మృతదేహం వద్ద నిమ్మకాయలు, పసుపు, కుంకుమ చల్లింది. క్షుద్రపూజల కోసం ఆమెను హత్య చేసినట్లు నమ్మించే యత్నం చేసింది. అయితే పోలీసుల విచారణలో అసలు విషయం బయటపడింది. దీంతో పోలీసులు కవితతో పాటు ఆమె ప్రియుడిని అరెస్ట్ చేశారు.
Bhupalapally | వరుస ఘటనలు
వివాహేతర సంబంధాల కోసం భర్తలను, పిల్లలను హత మారుస్తున్న ఘటనలు ఇటీవల పెరిగాయి. మేఘాలయలో సోనమ్ అనే మహిళ హనీమూన్‌కు వెళ్లిన సమయంలో తన భర్త రఘువంశీ (Raghuvamshi)ని హత్య చేసింది. ఈ విషయం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారి తీసింది. తెలంగాణలోని గద్వాల్‌కు చెందిన ప్రైవేట్ సర్వేయర్ తేజేశ్వర్ (Tejeswar)ను పెళ్లయిన నెల రోజులకే భర్త ప్రియుడితో కలిసి హత్య చేసింది. యువతులే కాకుండా.. పెళ్లిడుకు వచ్చిన పిల్లలు ఉన్న వారు సైతం వివాహేత బంధాల కోసం హత్యలు చేస్తుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.