అక్షరటుడే, ఇందూరు: Mla Dhanpal | ఏకాత్మత మానవతావాద సిద్ధాంతమే దేశ అభివృద్ధికి మంత్రమని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా అన్నారు. నగరంలోని మారుతి నగర్ స్నేహ సొసైటీలో పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ (Pandit Deen Dayal Upadhyaya) జయంతి నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. భారతీయ జన్ సంఘ్‌కు (Bharatiya Jan Sangh) సిద్ధాంతాలు లేవన్న వారికి చెప్పపెట్టులా ఏకాత్మత మానవతా సిద్ధాంతం ప్రతిపాదించిన మహోన్నత వ్యక్తి దీన్‌దయాల్ అని కొనియాడారు.
ఆయన ఆశించినట్టుగా చిట్టచివరి పేద వ్యక్తికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందించాలన్న సంకల్పంతో దేశాన్ని ప్రధాని మోదీ (PM Modi) నడిపిస్తున్నారన్నారు. 11 ఏళ్ల మోదీ పరిపాలన చూస్తే అనేక విప్లవాత్మక విజయాలతో పాటు సంక్షేమ పథకాలు తీసుకురావడం జరిగిందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో స్నేహ సొసైటీ ప్రతినిధులు సిద్దయ్య, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.
Mla Dhanpal | నగరంలోని పార్టీ కార్యాలయంలో..
జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ జయంతి నిర్వహించారు. ఈ సందర్భంగా అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా మాట్లాడుతూ.. ఏకాత్మత మానవతా వాదం అనే సిద్ధాంతం ఆధారంగా బీజేపీ రెండు సీట్ల నుంచి 300 సీట్లకు చేరుకుందన్నారు.
జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి(Dinesh Kulachari) మాట్లాడుతూ.. దీన్ దయాల్ ఆకాంక్షలకు అనుగుణంగా దేశ ప్రజల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చిందన్నారు. 11ఏళ్ల పాలనలో అనేక విప్లవాత్మక మార్పులు వచ్చాయన్నారు.
పీఎం ఆవాస్ యోజన (PM Awaas Yojana), గరీబ్ అన్నా కళ్యాణ్ యోజన (Garib Anna Kalyan Yojana), ఆయుష్మాన్ భారత్ (Ayushman Bharat), ఫసల్ బీమా యోజన, ఉజ్వల యోజన, సుకన్య సమృద్ధి యోజన, ముద్ర లోన్స్, విశ్వకర్మ యోజన ఇలా అనేక సంక్షేమ పథకాల ద్వారా దేశ ప్రజలు లబ్ధి పొందుతున్నారని పేర్కొన్నారు.
కార్యక్రమంలో ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి స్రవంతి రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శిలు నాగోల్ల లక్ష్మీనారాయణ, పోతనకర్ లక్ష్మీనారాయణ, జిల్లా నాయకులు మండల అధ్యక్షులు, మాజీ జీ కార్పొరేటర్లు పాల్గొన్నారు.
