అక్షరటుడే, దుండిగల్: Dundigal | కలియుగంలో అనగాష్టమి వృతంతో మానవుల కష్టాలు దూరమవుతాయని గణపతి సచ్చితానంద స్వామి (Ganapathi Sachchidananda Swami) పేర్కొన్నారు. దుండిగల్‌లో అవధూత దత్తపీఠంలో ఈనెల 12న నిర్వహించనున్న అనగాష్టమి వ్రతానికి భక్తులు పెద్ద ఎత్తున హాజరు కావాలని ఆయన కోరారు.
Dundigal | భక్తులు దర్శించుకోవాలి..
దుండిగల్‌లోని (Dundigal) అవధూత దత్తపీఠం ఈ శుక్రవారం అనగాష్టమి పూజలు జరుగుతాయని ఆలయ పూజారి సుధీర్ పంతులు తెలిపారు. ఈ వేడుకకు అన్ని జిల్లాల నుండి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని సూచించారు. అనగాష్ట వ్రతం ఆచరించడం వల్ల ఆఘము అంటే పాపము తొలగిపోతుందని ఆయన వివరించారు.
Dundigal | సాక్షాత్తు దత్తాత్రేయుడే..
ఈ వ్రత విధానం సాక్షాత్తు దత్తాత్రేయుడే (Lord Dattatreya) తన ప్రియ శిష్యుడు కార్తవీర్యార్జునికి ఉపదేశించిన శుభదినం మార్గశిర బహులాష్టమి అని పంతులు సుధీర్ తెలిపారు. కార్త వీర్యార్జున చక్రవర్తి తన రాజ్యంలోని వారందరితో ఈ అనఘా వ్రతం విశేషంగా చేయించేవాడని పేర్కొన్నారు. అలర్క మహారాజు, యదు మహారాజు, శ్రీరామచంద్రుడు, ధర్మరాజు వంటి పురాణపురుషులు కూడా ఈ వ్రతమును ఆచరించి శుభ ఫలితాలను పొందారని పురాణోక్తిలో ఉందని వివరించారు. ఈ కాలక్రమంలో మరుగున పడిన ఈ అద్భుత వ్రత విధానంను దత్తాత్రేయ స్వరూపులు పూజ సద్గురుదేవులు తమ భక్తులందరికీ ఉపదేశించి వారిచే ఆచరింప చేస్తూ బహుళ ప్రచారంలోకి ఈ అనఘా వ్రతాన్ని తీసుకొచ్చారన్నారు.
Dundigal | శత్రు బాధలు.. ఆర్థికపరమైన చిక్కులు..
శత్రు బాధలు, ఆర్థికపరమైన చిక్కులు, వివాహ సంబంధ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, మానసిక రుగ్మతలు వంటి వివిధ రకములైన ఇతి బాధలు నుంచి ఈ అనఘా వ్రతం ఆచరణ ఉపశమనం కలిగిస్తుందని ఆయన వివరించారు. ఇటువంటి అద్భుతమైన అనఘాష్టమి వ్రతాన్ని పూజ్య సద్గురు దేవుల దివ్య ఆశీస్సులతో మన దత్త అవధూత క్షేత్రం దుండిగలో చేపడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి పూజలు ప్రారంభమవుతాయని ఆయన పేర్కొన్నారు.