అక్షరటుడే, ఇందూరు: Traffic jam | నగరంలోని ఖలీల్వాడిలో (Khaleelwadi) సోమవారం భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది. నగరంలోని రమేష్ థియేటర్ (Ramesh Theatre Road) ఎదురు రోడ్డు వన్ వే చేయడంతో పలు వాహనాలు నలంద కళాశాల (Nalanda College) ముందు నుంచి వెళ్తున్నాయి. దీంతో భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది.
Traffic jam | వన్‌వేపై అవగాహన లేక..
గ్రామీణ ప్రాంతాల నుంచి ఆస్పత్రులకు వచ్చే వారికి.. స్థానికులకు సైతం వన్‌వేపై పూర్తి అవగాహన లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. ఒకసారి ఖలీల్వాడిలోకి వచ్చాక తిరిగి వెళ్లే క్రమంలో తికమకపడుతున్నారు. దీంతో సోమవారం సుమారు గంటపాటు వాహనాలు ఎటు వెళ్లలేక ఎక్కడికక్కడ ఇరుక్కుపోయాయి.
Traffic jam | పోలీసులతో వాగ్వాదం..
నగరంలోని ఖలీల్‌వాడి ప్రాంతం పూర్తిగా ఆస్పత్రులతో ఉండడంతో అటువైపు వచ్చే వాహనాల సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. అయితే ప్రధాన ప్రాంతంలోని వన్‌వే చేయడంతో పలువురు అవస్థలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం ట్రాఫిక్ పోలీసులతో (Traffic Police) వాగ్వాదం చోటుచేసుకుంది.