అక్షరటుడే నిజామాబాద్ సిటీ: Health Camp | నగరంలోని శివాజీ నగర్ మున్నూరుకాపు కళ్యాణ మండపంలో నిర్వహించిన ఉచిత వైద్యశిబిరానికి అనూహ్య స్పందన లభించింది. రాష్ట్ర యూత్ కాంగ్రెస్ (State Youth Congress) మాజీ ఉపాధ్యక్షుడు రామర్తిగోపి (Ramarthi Gopi) ఆధ్వర్యంలో ఆదివారం మెగా వైద్య శిబిరం నిర్వహించారు.
కార్యక్రమానికి నుడా ఛైర్మన్ కేశ వేణు (Nuda Chairman Kesha Venu), కాంగ్రెస్ సీనియన్ నాయకుడు కొండపాక రాజేష్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. నగరంలోని పలు డివిజన్లకు చెందిన ప్రజలు మెగా ఉచిత వైద్య శిబిరానికి హాజరయ్యారు. శిబిరం సక్సెస్ చేసినందుకు కాలనీ ప్రజలకు ముఖ్యంగా మహిళలకు రామర్తి గోపి ధన్యవాదాలు తెలియజేశారు. స్పెషలిస్ట్ డాక్టర్ల ఆధ్వర్యంలో వైద్యపరీక్షలు చేశారు.
జనరల్ ఫిజీషియన్ విశ్వతేజ్, గుండె వైద్య నిపుణులు రవి కిరణ్, ఆర్థోపెడిక్ సర్జన్ హర్షవర్ధన్ గౌడ్, సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ రాహుల్, ప్రసూతి వైద్య నిపుణులు శైలజ, చిల్డ్రన్స్ స్పెషలిస్ట్ అశ్విన్, దంత వైద్య నిపుణులు శిరీష శిబిరంలో ప్రజలకు వైద్యచికిత్సలు అందజేశారు. కార్యక్రమంలో రామర్తి గంగాధర్, ఆది శీను, గాండ్ల లింగం, అవిన్, విక్కీ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.