HomeUncategorizedJapan | ‘కుర్దు’లను బహిష్కరించాలని జపాన్​లో భారీ ర్యాలీ

Japan | ‘కుర్దు’లను బహిష్కరించాలని జపాన్​లో భారీ ర్యాలీ

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Japan | జపాన్​ ఫస్ట్​ పార్టీ (Japan First Party) ఆధ్వర్యంలో ఆ దేశంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. ఇస్లామిస్టులను, ముఖ్యంగా కుర్దు ముస్లింలను (Kurdu Muslims) జపాన్ నుంచి బహిష్కరించాలని డిమాండ్​ చేస్తూ ఈ ర్యాలీ నిర్వహించడం గమనార్హం. 1990 కాలంలో జపాన్‌లో కుర్దు ముస్లిం జనాభా తక్కువగా ఉండేది. కానీ గత ఐదేళ్లలో వీరి సంఖ్య విపరీతంగా పెరిగింది. కుర్దులు ఎక్కువగా టర్కీలో నివసిస్తుంటారు. వీరి జనాభా పెరుగుదలతో ఆందోళన వ్యక్తం చేసిన ఫస్ట్​ పార్టీ పెద్ద ఎత్తున నిరసన చేపట్టింది. కుర్దు ముస్లింలను వెంటనే దేశం నుంచి పంపించేయాలని డిమాండ్​ చేసింది. ఈ ఆందోళనల్లో జపాన్​ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.