Film Federation

Film Federation | ఫిల్మ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో భారీ ధర్నా.. సమస్యలు పరిష్కరించకపోతే నిరాహార దీక్ష చేస్తామని ప్రకటన

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Film Federation | తెలుగు చిత్ర పరిశ్రమలో నెలకొన్న వివాదం సద్దుమణగడం లేదు. వేతనాల పెంపు విషయంలో సినీ కార్మికులు, నిర్మాతల మధ్య చర్చలు కొలిక్కి రాలేదు. దీంతో ఆదివారం ఫిల్మ్ ఫెడరేషన్(Film Federation) ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు.

తమకు 30 శాతం వేతనాలు పెంచాలని కార్మికులు డిమాండ్(Workers Demand)​ చేస్తున్న విషయం తెలిసిందే. జీతాలు పెంచుతేనె షూటింగ్​లో పాల్గొంటామని స్పష్టం చేశారు. దీంతో వారం రోజులుగా టాలీవుడ్​లో షూటింగ్​లు నిలిచిపోయాయి. ఈ క్రమంలో శనివారం నిర్మాతలు(Producers), ఫిల్మ్​ ఫెడరేషన్​ మధ్య సుదీర్ఘ చర్చలు జరిగాయి. వేతనాల పెంపునకు ఓకే చెప్పినా.. నిర్మాతలు కొన్ని కండీషన్లు పెట్టారు. తొలి ఏడాది 15 శాతం, రెండు, మూడో ఏడాది 5 శాతం చొప్పున జీతాలు పెంచుతామని ప్రకటించారు. రూ.2వేల లోపు ఉన్నవారికి మొదటి ఏడాది 15 శాతం పెంచాలని, రూ.వేయిలోపు ఉన్నవారికి 20 శాతం పెంచాలని నిర్ణయించారు.

Film Federation | ధర్నాకు తరలివచ్చిన కార్మికులు

వేతనాల పెంపు విషయంలో నిర్మాతలు పెట్టిన కండీషన్లను కార్మిక సంఘాలు(Labor Unions) అంగీకరించలేదు. దీంతో శుక్రవారం కృష్ణా నగర్​లో ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు 24 క్రాఫ్ట్స్ కార్మికులు భారీగా తరలివచ్చారు. వారు మాట్లాడుతూ.. కొందరికి మాత్రమే వేతనాలు పెంచుతామనడం సరికాదన్నారు. నిర్మాత విశ్వప్రసాద్(Producer Vishwaprasad) తమకు నోటీసులు ఎందుకు పంపారో అర్థం కావడం లేదన్నారు. తాము ఛాంబర్‌తో మాత్రమే మాట్లాడుతామని స్పష్టం చేశారు. పీపుల్స్ మీడియా తమకు రూ. 90 లక్షల బకాయి ఉందని పేర్కొన్నారు. ఛాంబర్‌తో చర్చలు జరపాలని చిరంజీవి సూచించారని చెప్పారు. మంత్రి కోమటిరెడ్డి(Minister Komatireddy) కార్మికుల పక్షాన నిలబడ్డారని ఫిల్మ్​ ఫెడరేషన్​ పేర్కొంది.

Film Federation | వేతనాలు పెంచమంటే కేసులు పెడతారా..

తమకు నైపుణ్యం లేదని నిర్మాతలు ఎలా అంటారని ఫైటర్స్​ యూనియన్​ నాయకులు(Fighters Union Leaders) ప్రశ్నించారు. తాము ఒత్తిడి చేయడం లేదని.. తమను గుర్తించాలని కోరుతున్నామన్నారు. వేతనాలు పెంచాలని అడిగితే కేసులు వేస్తారా అని వారు ప్రశ్నించారు.

Film Federation | ఫిల్మ్​ ఛాంబర్​ను ముట్టడిస్తాం

ధర్నా అనంతరం ఫిల్మిం ఫెడరేషన్ అధ్యక్షుడు వల్లభనేని అనిల్(Vallabhaneni Anil) మీడియాతో మాట్లాడారు. తమ సమస్యలు పరిష్కారం కాకపోతే ఫిల్మ్​ ఛాంబర్​ను ముట్టడిస్తామని, నిరాహార దీక్ష చేస్తామని తెలిపారు. తాము ఫిలిం ఛాంబర్​తోనే తేల్చుకుంటామన్నారు. నిర్మాతలతో నేరుగా మాట్లాడమని చెప్పారు. ఒకవేళ తమతో కాదని ఫిల్మ్​ ఛాంబర్​ చేతులు ఎత్తేస్తే ప్రభుత్వం దగ్గరకు వెళ్తామని తెలిపారు.