ePaper
More
    Homeబిజినెస్​Eppeltone Engineers Ltd | భారీ లాభాలు పక్కా..!? రేపటినుంచి మరో ఐపీవో సబ్‌స్క్రిప్షన్‌ ప్రారంభం

    Eppeltone Engineers Ltd | భారీ లాభాలు పక్కా..!? రేపటినుంచి మరో ఐపీవో సబ్‌స్క్రిప్షన్‌ ప్రారంభం

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Eppeltone Engineers Ltd | ఇన్వెస్టర్ల నుంచి రూ. 43.96 కోట్లు సమీకరించాలన్న లక్ష్యంతో ఎప్పెల్టోన్‌ ఇంజినీర్స్‌ లిమిటెడ్‌(Eppeltone Engineers Ltd.) ఎస్‌ఎంఈ కంపెనీ ఐపీవోకు వస్తోంది. ఈ ఎస్‌ఎంఈ కంపెనీకి గ్రే మార్కెట్‌లో మంచి డిమాండ్‌ ఉంది. దీంతో తొలిరోజే భారీ లాభాలు వచ్చే అవకాశాలున్నాయి.

    యూపీఎస్‌ సిస్టమ్స్‌(UPS systems), హైగ్రేడ్‌ ఛార్జర్స్‌ వంటి వివిధ రకాల పవర్‌ కండిషనింగ్‌ ఎక్విప్‌మెంట్‌తో పాటు ఏవీఆర్‌, ఎంసీబీలు వంటి వివిధ రకాల ప్రొడక్ట్స్‌ తయారు చేసే ఎప్పెల్టోన్‌ ఇంజినీర్స్‌ లిమిటెడ్‌ పబ్లిక్‌ ఇష్యూకు వస్తోంది. ఫ్రెష్‌ ఇష్యూ(Fresh issue) ద్వారా రూ. 43.96 కోట్లు సమీకరించాలన్నది లక్ష్యం. ఫ్రెష్‌ ఇష్యూ కింద రూ. 10 ముఖ విలువ కలిగిన 34,34,000 షేర్లను విక్రయించనున్నారు. ఐపీవో(IPO) ద్వారా వచ్చిన ఆదాయాన్ని ప్రస్తుతం ఉన్న ఫ్యాక్టరీలో కొత్త ఎక్విప్‌మెంట్‌(Equipment) కొనుగోలు చేయడానికి, వర్కింగ్‌ క్యాపిటల్‌తోపాటు సాధారణ కార్పొరేట్‌ అవసరాల కోసం వినియోగించనున్నట్లు కంపెనీ ప్రకటించింది.

    Eppeltone Engineers Ltd | కంపెనీ పనితీరు..

    • 2025 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ రూ. 125.74 కోట్ల ఆదాయాన్ని(Revenue) సంపాదించింది. ఇది అంతకుముందు సంవత్సరంలో రూ. 80.04 కోట్లుగా ఉంది.
    • 2024 ఆర్థిక సంవత్సరంలో రూ. 8.43 కోట్లుగా ఉన్న నికరలాభం(Net profit) గత ఆర్థిక సంవత్సరంలో రూ. 11.23 కోట్లకు పెరిగింది.
    • ఇదే సమయంలో కంపెనీ ఆస్తుల(Assets)ను రూ. 69.83 కోట్లనుంచి రూ. 123.80 కోట్లకు పెంచుకుంది.

    Eppeltone Engineers Ltd | సబ్‌స్క్రిప్షన్‌ వివరాలు

    సబ్‌స్క్రిప్షన్‌(Subscription) మంగళవారం ప్రారంభం అవుతుంది. 19 వరకు బిడ్లను ఆహ్వానిస్తుంది. అలాట్‌మెంట్‌ స్టేటస్‌ 20వ తేదీ రాత్రి వెలువడే అవకాశాలున్నాయి. ఈ కంపెనీ షేర్లు 24వ తేదీన ఎన్‌ఎస్‌ఈలో లిస్ట్‌ కానున్నాయి.

    Eppeltone Engineers Ltd | ప్రైస్‌ బ్యాండ్‌

    ఒక్కో ఈక్విటీ షేరు ధర(Share price)ను రూ. 125 నుంచి రూ. 128గా కంపెనీ నిర్ణయించింది. లాట్‌లో వెయ్యి షేర్లున్నాయి. ఈ ఐపీవోలో పాల్గొనాలనుకునేవారు కనీసం 1000 షేర్ల కోసం రూ. 1,28,000లతో బిడ్లు వేయాల్సి ఉంటుంది.

    Eppeltone Engineers Ltd | కోటా, జీఎంపీ..

    క్యూఐబీ(QIB)లకి 50 శాతం, ఎన్‌ఐఐలకు 15 శాతం వాటాను కేటాయించారు. రిటైల్‌(Retail) ఇన్వెస్టర్లకు 35 శాతం షేర్లను విక్రయించనున్నారు. ఈ కంపెనీ షేర్లకు ప్రస్తుతం గ్రే మార్కెట్‌లో భారీ డిమాండ్‌ ఉంది. సోమవారం ఉదయం ఒక్కో షేరు రూ. 191 వద్ద ట్రేడ్‌ అవుతోంది. అంటే ఒకవేళ ఐపీవో అలాట్‌ అయితే తొలిరోజే 49 శాతం వరకు లిస్టింగ్‌ గెయిన్స్‌ వచ్చే అవకాశాలున్నాయని భావిస్తున్నారు.

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...