More
    Homeబిజినెస్​Oil Reserves | అండమాన్​లో భారీగా చమురు నిల్వలు.. భారత్​పై తగ్గనున్న దిగుమతుల భారం

    Oil Reserves | అండమాన్​లో భారీగా చమురు నిల్వలు.. భారత్​పై తగ్గనున్న దిగుమతుల భారం

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Oil Reserves | చమురు దిగుమతులపై ఆధారపడిన ఇండియాకు(India) అండమాన్ రూపంలో అనుకోని అదృష్టం కలిసొచ్చింది. ఇక్కడ భారీగా ముడి చమురు(Crude oil) నిల్వలు ఉన్నట్లు గుర్తించారు. దాదాపు 20 బిలియన్ బ్యారిళ్ల చమురు ఉందని భావిస్తున్నారు. ఇది దేశ ఆర్థిక వ్యవస్థకు ఎంతో మేలు చేకూర్చనుంది. చమురు నిల్వలను కనుగొన్నట్లు కేంద్ర పెట్రోలియం మరియు సహజ వాయువు మంత్రి హర్దీప్ సింగ్ పూరి(Minister Hardeep Singh Puri) ధ్రువీకరించారు. ఇది గయానాలో చమురు నిల్వలతో సమానమని పేర్కొన్నారు. ఇది ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చమురు నిల్వలలో 17వ స్థానంలో ఉంది.

    Oil Reserves | తగ్గనున్న దిగుమతులు

    గయానాలోని చమురు నిల్వలతో సమానంగా అండమాన్ సముద్రం(Andaman Sea)లో చమురు నిల్వలను విజయవంతంగా కనుగొనడం భారత్​కు ఎంతో కీలకం కానుంది. ఇది విదేశీ వనరులపై ఆధారపడడాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. దేశీయ చమురు ఉత్పత్తిని పెంచుతుంది, ఇండియా వినియోగిస్తున్న ముడి చమురులో 85 శాతానికి పైగా ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకుంటుందనే. అండమాన్​లో చమురు వెలికి తీయడం ప్రారంభమైతే విదేశాలపై ఆధారపడాల్సిన పరిస్థితి తగ్గిపోతుంది.

    Oil Reserves | ఆర్థిక వ్యవస్థకు ఊతం..

    అండమాన్ ప్రాంతంలో గయానా స్థాయిలో చమురు నిల్వలను కనుగొనడంలో భారతదేశం విజయవంతమైతే, అది దేశ ఆర్థిక వ్యవస్థకు ఎంతో ఊతమివ్వనుంది. 3.7 ట్రిలియన్ డాలర్లుగా ఆర్థిక వ్యవస్థ 20 ట్రిలియన్ డాలర్లకు పెరుగుతుందని మంత్రి హర్దీప్​ సింగ్​ పూరి తెలిపారు. చమురు నిల్వల కోసం ఒడిశా, రాజస్థాన్లలో అన్వేషణ కొనసాగుతోంది. అండమాన్, నికోబార్ దీవులలోనూ అన్వేషణ ప్రయత్నాలు జరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఆయిల్ ఇండియా, ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ONGC) వంటి కంపెనీలు ఈ ప్రాంతంలో డ్రిల్లింగ్, సర్వే కార్యకలాపాలను చురుగ్గా నిర్వహిస్తున్నాయి.

    More like this

    Dichpally mandal | గ్రామ పంచాయతీకి బాడీ ఫ్రీజర్​ అందజేత

    అక్షరటుడే, డిచ్​పల్లి: Dichpally mandal | డిచ్​పల్లి మండలం ఘన్​పూర్​కు (Ghanpur) చెందిన యువకులు గ్రామ పంచాయతీకి బాడీ...

    Armoor RTC | విద్యార్థుల ‘యాత్ర దానం’కు ప్రతిఒక్కరూ చేయూతనందించాలి..

    అక్షరటుడే, ఆర్మూర్: Armoor RTC | విద్యార్థుల ‘యాత్ర దానం’ విహారయాత్రలకు (Excursion) కార్పొరేట్​ సంస్థలు, ఎన్నారైలు, స్వచ్ఛంద...

    Cyber Fraud | డిజిటల్​ అరెస్ట్​ పేరిట బెదిరింపులు.. హార్ట్​ ఎటాక్​తో రిటైర్డ్​ డాక్టర్​ మృతి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Cyber Fraud | సైబర్​ నేరగాళ్ల బెదిరింపులకు ఓ మహిళ బలైపోయింది. డబ్బుల కోసం...