Homeక్రైంHyderabad | హైదరాబాద్‌లో భారీగా గంజాయి పట్టివేత

Hyderabad | హైదరాబాద్‌లో భారీగా గంజాయి పట్టివేత

అక్షరటుడే, వెబ్​డెస్క్​ : Hyderabad | హైదరాబాద్​ నగరంలో గంజాయి దందా జోరుగా సాగుతోంది. ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపడుతున్నా అక్రమార్కులు దందా సాగిస్తున్నారు. గంజాయి, డ్రగ్స్​ వంటి మత్తు పదార్థాలకు బానిసలుగా మారి యువత జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.

గంజాయి, డ్రగ్స్​ నిర్మూలనకు ప్రభుత్వం ఈగల్​ టీమ్ (Eagle Team)​ ఏర్పాటు చేసింది. ఈగల్​ టీమ్​ పోలీసులు దాడులు చేపడుతున్నా.. గంజాయి, డ్రగ్స్​ విక్రయాలు ఆగడం లేదు. తాజాగా హైదరాబాద్​ నగరంలో భారీ మొత్తంలో గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మహేశ్వరం, రాచకొండ SOT పోలీసుల జాయింట్‌ ఆపరేషన్​ చేపట్టి గంజాయి తరలిస్తున్న ముఠాను పట్టుకున్నారు.

Hyderabad | ఒడిశా నుంచి..

నగరంలో గంజాయి, డ్రగ్స్​ విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. విద్యార్థుల నుంచి మొదలు పెడితే పెద్ద పెద్ద డాక్టర్లు, వ్యాపారుల వరకు వీటికి బానిసలుగా మారారు. నగరంలో డ్రగ్స్​ విక్రయాలతో పాటు నగరం మీదుగా ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. తాజాగా ఒడిశా (Odisha) నుంచి రాజస్థాన్​ (Rajasthan)కు తరలిస్తున్న గంజాయిని పోలీసులు అబ్దుల్లాపూర్​మెట్‌లో పట్టుకున్నారు. దాని విలువ రూ.6 కోట్ల వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు.

Hyderabad | సిమెంట్​ బస్తాల ముసుగులో..

నిందితులు డీసీఎం వ్యాన్​లో సిమెంట్​ బస్తాల మధ్య గంజాయి దాచి తీసుకెళ్తున్నట్లు పోలీసులు తెలిపారు. డీసీఎంలో తనిఖీలు చేపట్టగా.. 1,210 కిలోల గంజాయి దొరికిందన్నారు. నిందితులను అరెస్ట్​ చేసి డీసీఎంను పోలీస్​ స్టేషన్​కు తరలించారు. కాగా నగరంలో ఇటీవల భారీగా డ్రగ్స్​, గంజాయి దొరుకుతుండటం ఆందోళన కలిగిస్తోంది.