అక్షరటుడే, నిజాంసాగర్: Nizamsagar Project | నిజాంసాగర్ ప్రాజెక్టులోకి ఎగువ భాగం నుంచి భారీగా ఇన్‌ఫ్లో వస్తుండడంతో క్రమంగా నీటిమట్టం పెరుగుతూ వస్తోంది. శుక్రవారం సాయంత్రానికి ప్రాజెక్టులో 1405.00 అడుగులకు (17.80 టీఎంసీలు) గాను 1394.23 అడుగుల (6.23 టీఎంసీలు) నీరు నిలువ ఉంది. ఎగువ భాగం నుంచి నిజాంసాగర్ ప్రాజెక్టులోకి (Nizamsagar Project) 9,400 క్యూసెక్కుల వరద వస్తోంది.
నిజాంసాగర్ ఎగువ భాగంలో నిర్మించిన సింగూరు ప్రాజెక్టులో (Singur Project) శుక్రవారం సాయంత్రానికి 523.600 మీటర్లకు (29.917 టీఎంసీలు) గాను గాను 522.085 మీటర్ల (22.022 టీఎంసీలు) మేర నీరు నిల్వ ఉంది. సింగూరు ప్రాజెక్టులోకి ఎగువ భాగం నుంచి 7,694 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో (Inflow) వచ్చి చేరుతోంది. సింగూరు ప్రాజెక్టు ఒక వరద గేటు ద్వారా 10,838 క్యూసెక్కుల నీటిని నిజాంసాగర్‌లోకి విడుదల చేస్తున్నారు. సింగూరు ప్రాజెక్టు ఇన్‌ఫ్లోకు అనుగుణంగా నీటి విడుదలను కొనసాగిస్తుండగా నిజాంసాగర్ ప్రాజెక్టులో రోజురోజుకు నీటి నిల్వ పెరుగుతుండడంతో ఆయకట్టు రైతులు (Farmers) సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.