3
అక్షరటుడే, వెబ్‌డెస్క్: Nizamabad City | నగరంలో అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని (gold) పోలీసులు పట్టుకున్నారు. అర్ధరాత్రి తర్వాత ఏసీపీ బృందం పోలీసులకు (ACP party police) భారీగా బంగారం తరలిస్తున్నట్లు సమాచారం అందింది.
కంఠేశ్వర్ ప్రాంతంలో సోదాలు నిర్వహించగా.. ఓ కారులో అక్రమంగా తరలిస్తున్న కిలో బంగారం (KG gold) దొరికింది. ఈ బంగారాన్ని మహారాష్ట్రలోని (Maharashtra) నాందేడ్ నుంచి నిజామాబాద్ మీదుగా ఆర్మూర్‌కు తరలిస్తున్నట్లు సమాచారం. కారులోని ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని మూడో టౌన్ పోలీసులకు అప్పగించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితులు ఆర్మూర్‌కు చెందిన వ్యక్తులుగా గుర్తించారు. పోలీసులు పట్టుకున్న బంగారం విలువ కోటి రూపాయలకు పైగా ఉంటుంది.