అక్షరటుడే, వెబ్డెస్క్ : Gold Seized | ముంబై ఎయిర్పోర్టు (Mumbai Airport)లో కస్టమ్స్ అధికారులు భారీగా బంగారం (Gold) స్వాధీనం చేసుకున్నారు.
అక్రమంగా బంగారం తరలిస్తున్నారనే సమాచారం మేరకు కస్టమ్స్ అధికారులు (Customs Officers) ఆదివారం తనిఖీలు చేపట్టారు. ఇద్దరు ఎయిర్ పోర్టు ఉద్యోగులే బంగారం రవాణా చేస్తున్నట్లు గుర్తించారు. వారిని అరెస్ట్ చేసి 4.44 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు. బంగారాన్ని పౌడర్ రూపంలోకి మార్చేసి.. సాక్సుల్లో దాచి తరలిస్తుండగా అధికారులు పట్టుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వీరి వెనక ఎవరు ఉన్నారనే కోణంలో విచారిస్తున్నారు.