HomeతెలంగాణGHMC | జీహెచ్​ఎంసీకి భారీగా నిధులు విడుదల

GHMC | జీహెచ్​ఎంసీకి భారీగా నిధులు విడుదల

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : GHMC | రాష్ట్ర ప్రభుత్వం జీహెచ్​ఎంసీ(GHMC)కి భారీగా నిధులు విడుదల చేసింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.2,654 కోట్లు కేటాయించిన విషయం తెలిసిందే. కాగా..​ తాజాగా అందులో సగం నిధులు విడుదల చేసింది.

రూ.1,327 కోట్లను జీహెచ్‌ఎంసీ పీడీ అకౌంట్లో జమ చేసింది. కాంట్రాక్టర్లకు పెండింగ్‌లో ఉన్న బిల్లులు చెల్లించడంతో పలు అభివృద్ధి పనులకు జీహెచ్​ఎంసీ ఈ నిధులు వినియోగించనుంది. వర్షాకాలం ప్రారంభం కావడంతో హైదరాబాద్(Hyderabad city)​లో వరద ముంపు పొంచి ఉంటుంది. ఈ క్రమంలో రోడ్ల అభివృద్ధి, నాలాల మరమ్మతులు చేపట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.