అక్షరటుడే, నిజాంసాగర్: Nizamsagar | నిజాంసాగర్ ప్రాజెక్టులో జాలరికి 32 కిలోల భారీ చేప దొరికింది. ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్ ప్రాంతంలో రాంరెడ్డిపేట గ్రామానికి చెందిన ఓ జాలరి రోజు మాదిరిగానే ఆదివారం సాయంత్రం చేపల వేటకు వెళ్లాడు. అయితే అతడికి 32 కిలోల బొచ్చచేప దొరకడంతో ఆనందం వ్యక్తం చేశాడు. దానిని నిజాంసాగర్ మండలంలోని అచ్చంపేట గ్రామంలో విక్రయించాడు.
