అక్షరటుడే, వెబ్‌డెస్క్: Dubai | దుబాయ్లో భారీ అగ్ని ప్రమాదం(Major fire Accident) చోటు చేసుకుంది. దుబాయ్ మెరీనాలోని టైగర్ టవర్(మెరీనా పినాకిల్) వద్ద అగ్ని ప్రమాదం జరిగింది. భారీ అంతస్తులతో నిర్మించిన భవనంలో ప్రమాదం చోటు చేసుకోవడం గమనార్హం. మంటలు వేగంగా భవనం మొత్తం వ్యాపించాయి. అధికారులు సకాలంలో స్పందించి ఆ భవనంలోని నాలుగు వేల మందిని సురక్షితంగా తరలించారు. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. దుబాయ్ మెరీనా(Dubai Marina)లోని ఒక ఎత్తయిన నివాస, వాణిజ్య టవర్ పైఅంతస్తు నుంచి మంటలు చెలరేగాయని సమాచారం. అగ్ని మాపక సిబ్బంది(Firefighters) మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
