HomeజాతీయంIAS coaching centers | ఐఏఎస్ కోచింగ్​ సెంటర్లకు భారీ జరిమానా.. ఎందుకో తెలుసా?

IAS coaching centers | ఐఏఎస్ కోచింగ్​ సెంటర్లకు భారీ జరిమానా.. ఎందుకో తెలుసా?

అనుమతి లేకుండా ఐఏఎస్ ర్యాంకర్ల పేర్లు, ఫొటోలతో ప్రచారం చేసుకున్న రెండు కోచింగ్​ సెంటర్లకు సీసీపీఏ భారీగా జరిమానా విధించింది. మరో 57 ఇనిస్టిట్యూట్​లకు నోటీసులు ఇచ్చింది.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : IAS coaching centers | రెండు ప్రముఖ ఐఏఎస్​ కోచింగ్​ సెంటర్లకు సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (CCPA) భారీ జరిమానా విధించింది. ఒక్కో సంస్థకు రూ.8 లక్షల చొప్పున ఫైన్​ వేస్తూ.. ఉత్తర్వులు ఇచ్చింది.

సివిల్​ సర్వీసెస్​ (Civil Services) కోచింగ్​లో పేరున్న సంస్థలలైన దీక్షాంత్​ ఐఏఎస్ (Dikshant IAS)​, అభిమన్యూ ఐఏఎస్​ సెంటర్లకు జరిమానా వేసింది. యూపీఎస్సీ (UPSC)లో విజయం సాధించిన అభ్యర్థుల నుంచి వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా, వినియోగదారుల రక్షణ చట్టం, 2019 కింద ఈ చర్య తీసుకుంది. ఈ సంస్థలు యూపీఎస్సీలో ర్యాంకులు సాధించిన అభ్యర్థుల పేర్లను అనుమతి లేకుండా వాడుకున్నాయి. దీంతో సదరు అభ్యర్థుల ఫిర్యాదు మేరకు సీసీపీఏ చర్యలు చేపట్టింది.

IAS coaching centers | విజేతల పేర్లతో ప్రచారం..

దీక్షాంత్, అభిమన్యూ ఐఏఎస్ (Abhimanyu IAS) సెంటర్లు ఆధారాలు లేకుండా విజయం గురించి అతిశయోక్తి వాదనలను ప్రచురించారని CCPA దర్యాప్తులో వెల్లడైంది. వారు విజయవంతమైన UPSC అభ్యర్థుల పేర్లను అధిక ఎంపిక సంఖ్యలను ప్రకటించడానికి ఉపయోగించారు. చాలా మంది టాపర్లు తమ విద్యార్థులు అని తప్పుడు ప్రచారం చేశారు. మినీ శుక్లా అనే యువతి దీక్షాంత్ కోచింగ్​ సెంటర్​ తన అనుమతి లేకుండా తన పేరు, చిత్రాన్ని ప్రకటనలలో ఉపయోగించారని ఫిర్యాదు చేసింది. దీంతో సీసీపీఏ విచారణ చేపట్టింది.

అభిమన్యు కోచింగ్​ సెంటర్​ సైతం ఇలాంటి ప్రచారం చేసింది. తన ఫొటోను అనుమతి లేకుండా ఉపయోగించినందుకు నటాషా గోయల్ సంస్థపై ఫిర్యాదు చేశారు. అంతేగాకుండా ఆ సంస్థ 2023లో 139 మంది తమ విద్యార్థులు ర్యాంక్​ సాధించినట్లు ప్రచారం చేసింది. అయితే అందులో 88 మంది స్వతంత్రంగా పరీక్షలను ఉత్తీర్ణులయ్యారని తేలింది. తప్పుడు ప్రకటనలతో విద్యార్థులు మోసపోయారని గ్రహించిన సీసీపీఏ రెండు సంస్థలకు రూ.8 లక్షల చొప్పున జరిమానా వేసింది. మరో 57 సంస్థలకు నోటీసులు జారీ చేసింది. తప్పు దోవ పట్టించే ప్రకటనలను తొలగించాలని ఆదేశించింది.

IAS coaching centers | తెలుగు రాష్ట్రాల్లో..

తెలుగు రాష్ట్రాల్లో ఐఐటీ (IIT)కి ఆదరణ ఉంది. చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలను ఐఐటీల్లో చేర్పించాలని కలలు కంటారు. దీనిని ఆసరాగా చేసుకొని పలు కార్పొరేట్​ కాలేజీలు మోసాలకు పాల్పడుతున్నాయి. ఐఐటీ ర్యాంకర్లు తమ కాలేజీ, పాఠశాలలో చదివినట్లు తప్పుడు ప్రకటనలు ఇస్తున్నారు. ఒకే విద్యార్థి ఫొటోలను రెండు, మూడు కాలేజీలు సైతం వినియోగిస్తుండటం గమనార్హం. అయితే సదరు విద్యార్థులకు ఆయా కాలేజీలు డబ్బులు చెల్లిస్తారని, అందుకే ఫిర్యాదులు చేయడం లేదని సమాచారం. అయితే ఈ తప్పుడు ప్రకటనలతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు నష్టపోతున్నారు.