అక్షరటుడే, వెబ్‌డెస్క్:Stock Market | ప్రధాన కంపెనీల క్యూ1 ఫలితాలు నిరాశపరచడం, ఎఫ్‌ఐఐలు పెట్టుబడులు ఉపసంహరిస్తుండడం, యూఎస్‌తో వాణిజ్య ఒప్పందం(Trade deal) విషయం అనిశ్చితి కొనసాగుతుండడం ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీస్తున్నాయి.
టెక్ కంపెనీలు భారతీయులను కాకుండా అమెరికన్లనే నియమించుకోవాలన్న యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్(Trump) మాటలతో ఐటీ స్టాక్స్ ఒత్తిడికి గురయ్యాయి. కనిష్టాల వద్ద కొనుగోళ్లకు ఆసక్తి చూపుతున్న ఇన్వెస్టర్లు.. గరిష్టాల వద్ద అమ్మకాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. దీంతో మార్కెట్లు కొంతకాలంగా రేంజ్ బౌండ్‌లోనే కొనసాగుతున్నాయి. గురువారం సెన్సెక్స్(Sensex) 53 పాయింట్ల స్వల్ప లాభంతో ప్రారంభమెనా ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో వెంటనే నష్టాల్లోకి జారుకుంది. ఇంట్రాడేలో క్రమంగా పతనమవుతూ గరిష్టంగా 737 పాయింట్లు కోల్పోయింది. నిఫ్టీ(Nifty) 24 పాయింట్ల స్వల్ప లాభంతో ప్రారంభమైనా గరిష్టంగా 228 పాయింట్లు పడిపోయింది. చివరికి సెన్సెక్స్ 542 పాయింట్ల నష్టంతో 82,184 వద్ద, నిఫ్టీ 157 పాయింట్ల నష్టంతో 25,062 వద్ద స్థిరపడ్డాయి. నిఫ్టీలో ఎటర్నల్, డాక్టర్ రెడ్డీస్, టాటా మోటార్స్, టాటా కన్జూమర్, సిప్లా లాభాలతో ముగియగా.. ట్రెంట్, నెస్లే, శ్రీరామ్ ఫైనాన్స్, టెక్ మహీంద్రా, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ నష్టపోయాయి.
బీఎస్‌ఈ(BSE)లో నమోదైన కంపెనీలలో 1,645 కంపెనీలు లాభపడగా 2,410 స్టాక్స్ నష్టపోయాయి. 166 కంపెనీలు ఫ్లాట్‌గా ముగిశాయి. 149 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 48 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి. 6 కంపెనీలు అప్పర్ సర్క్యూట్‌ను, 8 కంపెనీలు లోయర్ సర్క్యూట్‌ను తాకాయి. బీఎస్‌ఈలో నమోదైన కంపెనీల సంపద విలువ రూ. 3.33 లక్షల కోట్లు తగ్గింది.
Stock Market | పీఎస్‌యూ బ్యాంక్, ఫార్మా మినహా..
పీఎస్‌యూ బ్యాంక్, ఫార్మా(Pharma) మినహా మిగతా రంగాల షేర్లు నష్టాల బాటలో పయనించాయి. ఐటీ ఇండెక్స్ రెండు శాతం వరకు పతనమైంది. రియాలిటీ, ఎఫ్‌ఎంసీజీ సూచీలు ఒక శాతానికిపైగా నష్టపోయాయి. బీఎస్‌ఈలో పీఎస్‌యూ బ్యాంక్(PSU bank) 1.44 శాతం, హెల్త్‌కేర్ ఇండెక్స్ 0.54 శాతం, మెటల్ ఇండెక్స్ 0.10 శాతం, ఆటో సూచీ 0.03 శాతం పెరిగాయి. ఐటీ ఇండెక్స్(IT index) 2.22 శాతం పడిపోగా.. ఎఫ్‌ఎంసీజీ 1.08 శాతం, రియాలిటీ 1.05 శాతం, ఎనర్జీ 0.90 శాతం, యుటిలిటీ 0.67 శాతం, ఆయిల్ అండ్ గ్యాస్ 0.60 శాతం, టెలికాం 0.59 శాతం, పవర్ ఇండెక్స్ 0.59 శాతం, బ్యాంకెక్స్ 0.49 శాతం పతనమయ్యాయి. లార్జ్ క్యాప్ ఇండెక్స్ 0.57 శాతం, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.50 శాతం, మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.43 శాతం నష్టపోయాయి.
Top Gainers:బీఎస్‌ఈ సెన్సెక్స్‌లో 6 కంపెనీలు లాభాలతో 24 కంపెనీలు నష్టాలతో ముగిశాయి. ఎటర్నల్ 3.44 శాతం, టాటామోటార్స్ 1.51 శాతం, సన్‌ఫార్మా 0.61 శాతం, టాటా స్టీల్ 0.40 శాతం, టైటాన్ 0.34 శాతం లాభపడ్డాయి.
Top Losers:ట్రెంట్ 3.92 శాతం, టెక్‌మహీంద్రా 3.15 శాతం, బజాజ్ ఫిన్‌సర్వ్ 1.59 శాతం, రిలయన్స్ 1.52 శాతం, హెచ్‌సీఎల్ టెక్ 1.51 శాతం నష్టపోయాయి.