HomeతెలంగాణEagle System | రైళ్లలో గంజాయి తరలింపు.. భారీగా స్వాధీనం చేసుకున్న ఈగల్​ టీం

Eagle System | రైళ్లలో గంజాయి తరలింపు.. భారీగా స్వాధీనం చేసుకున్న ఈగల్​ టీం

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: Eagle System | ఆంధ్రప్రదేశ్​లోని (Andhra Pradesh) పలు రైల్వే స్టేషన్లలో భారీగా గంజాయి పట్టుకున్నారు. రాష్ట్రంలో ఇటీవల గంజాయి అక్రమ రవాణా పెరుగుతోంది. ఒడిశాతో పాటు ఏపీలోని మారుమూల ప్రాంతాల నుంచి గంజాయిని రైళల్లో పలు నగరాలకు సరఫరా చేస్తున్నారు. ఈ క్రమంలో గురువారం ఈగల్‌, GRP, RPF పోలీసులు తనిఖీలు చేపట్టారు. పలు రైళ్లతో సోదాలు చేసి భారీగా గంజాయి స్వాధీనం చేసుకున్నారు.

ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వం (Andhra Pradesh government) డ్రగ్స్​, గంజాయిని అరికట్టడానికి ఈగల్​ వ్యవస్థను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈగల్​ చీఫ్​ (Eagle Chief) రవి ఆదేశాల మేరకు దాడులు చేసి భారీగా గంజాయి చాకెట్లు (ganja chocolates), గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఈగల్​ చీఫ్​ మాట్లాడుతూ.. గంజాయి సరఫరాపై కఠినంగా వ్యవహరిస్తున్నామని వెల్లడించారు. గంజాయి అమ్మినా, కొన్నా, సరఫరా చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గంజాయి స్మగ్లర్ల ఆస్తులు అటాచ్​ చేసినట్లు ఆయన పేర్కొన్నారు. తెలంగాణలో సైతం డ్రగ్స్​ నియంత్రణకు ఇటీవల సీఎం రేవంత్​రెడ్డి (CM Revanth Reddy) ఈగల్​ వ్యవస్థను ఏర్పాటు చేశారు. డ్రగ్స్​ నియంత్రణకు చర్యలు చేపడతామని తెలిపారు.