అక్షరటుడే, కామారెడ్డి: Nagavalli Express | రైలులో అక్రమంగా తరలిస్తున్న ఎండుగంజాయిని కామారెడ్డి రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (Kamareddy Railway Protection Force), ఎక్సైజ్ అధికారులు (Excise officials) పట్టుకున్నారు. ఎక్సైజ్ సీఐ సంపత్ కృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం సంబల్పూర్ నుంచి నాందేడ్‌కు (Sambalpur to Nanded) వెళ్తున్న నాగవల్లి ఎక్స్‌ప్రెస్‌లో ఎండు గంజాయి తరలిస్తున్నట్లు సమాచారం వచ్చింది. దీంతో వెంటనే రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, ఎక్సైజ్ అధికారులు కామారెడ్డి రైల్వే స్టేషన్లో (Kamareddy Railway Station) తనిఖీలు చేపట్టారు. అనుమానాస్పదంగా ఉన్న బ్యాగు తెరిచి చూడగా 12 కిలోల ఎండు గంజాయి ఉన్నట్టు గుర్తించారు. అనంతరం గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితుల కోసం గాలిస్తున్నట్లు సీఐ తెలిపారు. నిషేధిత మత్తు పదార్థాలు తరలిస్తే ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ హెచ్చరించారు. దాడుల్లో ఎక్సైజ్ ఎస్సై విక్రమ్ కుమార్, రైల్వే ఎస్సై వెంకటేశ్వర్లు, ఏఎస్సై రవీంద్ర బాబు, సిబ్బంది పాల్గొన్నారు.