Homeజిల్లాలునిజామాబాద్​Armoor Bjp | ఆర్మూర్‌ బీజేపీలో పలువురు చేరిక

Armoor Bjp | ఆర్మూర్‌ బీజేపీలో పలువురు చేరిక

ఆర్మూర్​ ఎమ్మెల్యే రాకేష్​ రెడ్డి ఆధ్వర్యంలో పలువురు బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా రాకేష్​ రెడ్డి మాట్లాడుతూ.. జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలను బీజేపీ కైవసం చేసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేరారు.

- Advertisement -

అక్షరటుడే, ఆర్మూర్‌: Armoor Bjp | బీజేపీలో పలువురు చేరారు. 8వ వారు నుంచి చిన్నారెడ్డి ఆధ్వర్యంలో అరుణ్‌ తన 150 మంది అనుచరులతో కలిసి పార్టీ కండువా కప్పుకున్నారు. ముందుగా భారీ బైక్‌ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే రాకేశ్​ రెడ్డి (MLA Rakesh Reddy) సమక్షంలో పార్టీలో చేరారు. వీరికి ఎమ్మెల్యే కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

Armoor Bjp | అన్ని మున్సిపాలిటీలు బీజేపీవే..

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఎంపీ అర్వింద్​ (MP Arvind) నేతృత్వంలో జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలను బీజేపీ కైవసం చేసుకుంటుందన్నారు. స్థానిక ఎన్నికల్లో ఆర్మూర్‌లో బీజేపీ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. త్వరలో ఇతర పార్టీల నుంచి బీజేపీలో భారీ చేరికలు ఉంటాయని, నియోజకవర్గంలో ఉన్న బీజేపీ కార్యకర్తలతో కలిసి భారీ సభ నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు మందుల బాలు, పోల్కం వేణు,పెద్దోళ్ల గంగారెడ్డి, కలిగోట్‌ గంగాధర్, అనిల్, తదితరులు పాల్గొన్నారు.