అక్షరటుడే, వెబ్‌డెస్క్:CM Revanth | తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల సంఘం ఛైర్మన్ జస్టిస్ షమీమ్ అక్తర్ (HRC Chairman Shamim Akhtar) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఛైర్మన్‌కు సీఎం(CM) శుభాకాంక్షలు తెలిపారు. మానవ హక్కుల కమిషన్ ఛైర్మన్‌గా నియమితులైన జస్టిస్ షమీమ్‌అక్తర్ ఇటీవల బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. అలాగే రాష్ట్ర పోలీస్ ఫిర్యాదుల ప్రాధికార సంస్థ ఛైర్మన్‌గా నియమితులైన జస్టిస్ శివ శంకర్ రావు(Justice Siva Shankar Rao) సైతం సీఎం రేవంత్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. అనంతరం వారు కాసేపు చర్చించారు.
